Breaking News

చిన్నారుల  జీవితాల్లో  నవ్వులు...

Published on Wed, 11/18/2026 - 04:25

చిన్నపిల్లల్లో క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సలోనూ, ఆ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కలిగించడంలోనూ చేసిన కృషికి ప్రముఖ పీడియాట్రిక్‌ అంకాలజీ వైద్యురాలు డాక్టర్‌ చందన మారెడ్డి గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ లీడర్‌షిప్‌ అవార్డు –2026 ఇటీవల అందుకున్నారు. ఈ సందర్భంగా చందనా మారెడ్డి ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్న విషయాలు..

హైదరాబాద్‌ కొండాపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో పీడియాట్రిక్‌ ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్‌ చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్‌ చందనా మారెడ్డి. క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు అందిస్తున్న సపోర్ట్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించడం, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులతో సంభాషించడం రాబోయే రోజుల్లో ఈ రంగంలో మరింత కృషికి ప్రోత్సాహమిచ్చిందన్నారు. 

‘‘క్యాన్సర్ల బారిన పడిన పిల్లలు కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 5 ఏళ్లు పడుతుంది వారి ఆరోగ్యస్థాయిని బట్టి. అయితే, ఆ సమయంలో ‘పిల్లలకు ఏమవుతుందో..’ అనే ఆందోళన, ఒత్తిడి ఆ పిల్లల తల్లిదండ్రుల్లో చాలా ఉంటుంది. ఈ సమస్య పట్టణ ప్రాంతపు తల్లిదండ్రుల్లో ఒకలా ఉంటే, గ్రామీణ ప్రాంతపు తల్లిదండ్రుల్లో మరోలా ఉంది. ఒక క్యాన్సర్‌ బాధిత పిల్లవాడి చికిత్సకు దాదాపు 20 – 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. 

అంత డబ్బు పెట్టేవారు కొందరే ఉంటారు. ఇలాంటప్పుడు క్యాన్సర్‌ బాధిత పిల్లల చికిత్సలోనూ, వారికి అవసరమయ్యే ఫండ్స్‌ సమకూర్చడంలోనూ, కుటుంబ ఉపాధి, వారి ఆందోళన తగ్గే మార్గాలపైనా వర్క్‌ చేశాను. వాటి అమలు వల్ల తల్లిదండ్రుల్లో ఆందోళన తగ్గడం, పిల్లల చికిత్స సులభం అవుతూ వచ్చాయి. వైద్య చికిత్సతోపాటు సామాజిక సేవా అంశం కూడా ఇందులో కలిసి ఉండటం.. వల్ల ఈ గుర్తింపు లభించింది. 

దాదాపు 15 రంగాల నుంచి ఈ గ్లోబల్‌ అవార్డుకు ఎంపిక జరిగింది. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన కార్యక్రమానికి సింగపూర్, మలేషియా, అమెరికా, లండన్‌... ఇలా దేశవిదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తమ తమ వృత్తులలో రాణిస్తూ సమాజానికి మంచి చేస్తున్న గొప్ప వ్యక్తులను కలుసుకోవడం ఒక మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది. 

క్లిష్టమైన చికిత్సలో భాగం..
íపీడియాట్రిక్స్‌ స్పెషలైజేషన్‌ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లోని నీలోఫర్‌లో ఏడాదిపాటు వర్క్‌ చేశాను. ఆ తర్వాత అపోలో హాస్పిటల్స్‌లో జూనియర్‌ కన్సల్టెంట్‌గా చేశాను. ఆ తర్వాత లండన్‌లో ఫెలోషిప్‌ పూర్తిచేసి, ఇండియాకు వచ్చాను. ఇక్కడి కిమ్స్‌లో చేరడంతోనే క్లిష్టమైన క్యాన్సర్‌ కేసుల చికిత్సలో భాగమయ్యాను. రీసెర్చ్‌ వర్క్‌లో ఉన్నాను. ఇందులో ఉండే అన్ని రకాల చికిత్సలతో పాటు సమస్యలు కూడా తెలుసు కాబట్టి, క్యాన్సర్‌ పిల్లల కుటుంబాలలో నెలకొనే ఆందోళనను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. 

అన్నివైపులా మద్దతు
సాధారణంగా క్యాన్సర్ల చికిత్సలో చాలా సపోర్ట్‌ సిస్టమ్‌ ఉండాలి. బ్లడ్‌ క్యాన్సర్‌ అయితే బ్లడ్‌ బ్యాంక్స్‌ నుంచి, కీమోకి రేడియేషన్, అంతర్గత అవయవాల పనితీరుకు ఆయా సెక్షన్ల నుంచి ... ఇలా ప్రతీ విభాగం నుంచి మద్దతు ఉండాలి. పిల్లలను కాపాడుకోవాలంటే పనిలోనూ వేగం ఉండాలి. మన దేశంలో ప్రతి యేటా 75 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా చూస్తే పిల్లల క్యాన్సర్‌లలో ప్రతి పదింటిలో ఏడు మన దేశంలోనే నమోదవుతున్నాయి. కారణాలు ఇవీ అని చెప్పలేం. కానీ, సరైన సమయంలో వ్యాధిని నిర్ధారించి, చికిత్స అందిస్తే పిల్లల్లో క్యాన్సర్లు 98 శాతం నయం అయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించడం, త్వరగా చికిత్స అందించడం దీనిలో ప్రధానమైంది. 

ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తమ ప్రణాళికలతో పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఉంటుంది. ఈ రీసెర్చ్, కుటుంబాలకు ఇచ్చే గైడెన్స్, కోలుకుంటున్న చిన్నారులు.. ఇవన్నీ నోటిమాట ద్వారానే ఎంతోమందికి చేరువయ్యాయని ఈ అవార్డు తెలియజెప్పింది. స్కూల్‌ చదువుల నుంచే డాక్టర్‌ని కావాలని తపన బలంగా ఉండేది.

 అదే సమయంలో సృజనాత్మక రంగాలలో రాణించాలనే ఆలోచనా ఉండేది. అందుకు తగినట్టుగానే కూచిపూడి నృత్యసాధన చేస్తున్నాను. పెయింటింగ్స్‌ వేస్తుంటాను. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేస్తున్నాను. డాక్టర్‌గా, ఆర్టిస్టుగా ఎదగడానికి మా నాన్న డాక్టర్‌ అంజిరెడ్డి, అమ్మ జయంతి, తమ్ముడు సాయిరాజీవ్‌ల ప్రోత్సాహం మరవలేనిది’’ అని వివరించారు వృత్తిపరమైన బాధ్యతకు మించి సమాజసేవకూ ప్రాధాన్యమిస్తున్న ఈ యువ డాక్టర్‌.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)