Breaking News

వాల్‌స్ట్రీట్‌ వేదికపై మన ‘చిట్టి’ సైంటిస్ట్‌లు!

Published on Wed, 11/18/2026 - 00:46

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌...దాని చారిత్రాత్మక బాల్కనీలో మన ముగ్గురు బాలికలు ఆనాటి ట్రేడింగ్‌ ముగింపు గంట  మోగిస్తుంటే అందరూ మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారు. అమెరికాలోనే ప్రతిష్టాత్మకమైన ‘2026 3ఎం యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’లో మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్న భారత సంతతి బాలికలు రాజీ దోషి, ఆయిషా ఆసిఫ్, శార్వి మహాజన్‌ సాధించిన అరుదైన గౌరవం అది! పర్యావరణ సమస్యలకు తమ ప్రయోగశాలల్లో సమాధానాలు వెతకడం వల్లే వారికి ఈ గౌరవం.

‘3ఎం ఎంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’.... అమెరికాలో పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక సైన్స్ పోటీ. వేలమంది పాల్గొనే ఆ పోటీలో మన బాలికలు ‘పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నట్టుగా నిలిచారు. ఇన్నోవేషన్‌ దిగ్గజం 3ఎం నిర్వహించే ఈ పోటీలో 5 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.  రోజువారీ సమస్యలకు సైన్స్ ద్వారా పరిష్కారం చూపడం వీరు స్వీకరించే ఛాలెంజ్‌. అంటే ఇది చిన్న వయసులోనే సైంటిస్ట్‌లను బయటకు తీయడం. 

ఇలాంటి పోటీలో టాప్‌ 10గా నిలవడమే గొప్ప. అలంటింది అమెరికాలో స్థిరపడిన భారతీయ అమ్మాయిలకు  ఈ సంవత్సరం మొదటి మూడు స్థానాలు దక్కాయి. మొదటి స్థానంలో నిలిచిన రాజీ దోషీకి 25 వేల డాలర్లు (21 లక్షలు) లభిస్తే, మిగిలిన ఇద్దరూ చెరో వెయ్యి డాలర్లు గెలుచుకున్నారు. వీరికి భవిష్యత్తులో సీనియర్‌ శాస్త్రవేత్తలతో పని చేసే వీలు లభిస్తుంది. దాని వల్ల వీరు ప్రపంచ స్థాయి ఆవిష్కర్తలుగా ఎదుగుతారు. ఇంతకూ మన పిల్లలు ఏం ఆవిష్కరించారు?

పర్యావరణ ‘బంక’
మనం రోజూ వాడే కెమికల్‌ గ్లూ గాలిలోకి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తుందని, పైగా గ్లూ అతికించిన వస్తువులను విడదీయలేక పారేసి చెత్తను పెంచుతున్నామని ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల ఆయిషా ఆసిఫ్‌ గుర్తించింది. కృత్రిమ బంక కంటే సహజమైన బంక మంచిదని నిర్ణయించుకుంది. 

నత్తగుల్లల నుంచి ప్రకృతి నుంచి దొరికే పదార్థాలతో  కాలుష్య రహిత ‘బయో–అడ్హెసివ్‌’ తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే అవసరమైనప్పుడు గట్టిగా అతుక్కుని ఉంటుంది, మళ్లీ ఆ వస్తువును రిపేర్‌ చేయాలన్నా, రీసైకిల్‌ చేయాలన్నా సులభంగా విడదీయవచ్చు! ఈ వినూత్న ఆలోచన ఆయిషాకు జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని తెచ్చిపెట్టింది. ‘ప్రకృతే అన్నింటికి సమాధానం’ అంటోంది ఏడో తరగతి చదువుతున్న ఆయిషా.

నిద్రమత్తును పసిగట్టే ‘స్మార్ట్‌ క్యాప్‌’
కాలిఫోర్నియాకు చెందిన 14 ఏళ్ల శార్వి మహాజన్ కు చిన్నప్పటి నుంచీ మనిషి మెదడు పని తీరుపై విపరీతమైన ఆసక్తి. హైవేలపై డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలు ఆమెను ఆలోచింపజేశాయి. ఇందుకు విరుగుడుగా ఆమె తయారు చేసిందే ‘న్యూరోడ్రైవ్‌ అలర్ట్‌’ అనే స్మార్ట్‌ క్యాప్‌. 

మనం మామూలుగా పెట్టుకునే బేస్‌బాల్‌ క్యాప్‌లో అమర్చిన ఈఈజీ (ఉఉఎ) సెన్సార్లు డ్రైవర్‌ మెదడు తరంగాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఏమాత్రం నిద్రమత్తు కనిపించినా,  వెంటనే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా అలారం మోగించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ శార్వికి మూడో స్థానాన్ని అందించింది. ‘భవిష్యత్తులో న్యూరోసైన్స్, ఏఐలను కలిపి శారీరక వైకల్యం ఉన్నవారు నడిచే, మాట్లాడే వ్యవస్థ తయారు చేస్తాను’ అని శార్వి ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

ఈ పిల్లలు అందరిలాంటి పిల్లలే. కాని ఆలోచన గొప్పగా చేశారు. అందుకు అవసరమైన ప్రయత్నం, ప్రయోగం చేశారు. విజయం సాధించారు. తరగతి గది పాఠాలను కేవలం పరీక్షల వరకే పరిమితం చేయకుండా, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగుచేయ పూనుకున్నారు. రాజీ, ఆయిషా, శార్వి మన భారతీయ సంతతి అయినందుకు గర్వించాలి. ఎందుకంటే ఆడపిల్లలు తలుచుకుంటే సైన్స్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర రాయగలరని వాల్‌స్ట్రీట్‌ వేదిక సాక్షిగా వారు చాటి చెప్పారు. 

సముద్రపు కన్నీళ్లు తుడిచే ‘ఆల్కాకోర్‌’
13 ఏళ్ల రాజీ దోషికి సముద్ర తీరంలో రంగురంగుల గవ్వలు ఏరుకోవడం  ఇష్టం. కానీ వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీటిలో ఆమ్లగుణం పెరిగి  గవ్వలు, వాటిలో ఉండే సూక్ష్మజీవులు కరిగిపోతున్నాయని ఆమె గ్రహించింది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకుంటున్న ఈ సమస్యకు రాజీ పరిష్కారం ఆలోచించింది. సముద్రపు నాచు, అరగోనైట్‌ ఖనిజాలను కలిపి ‘ఆల్కాకోర్‌’ అనే సహజసిద్ధమైన పదార్థాన్ని రూపొందించింది. 

ఇది సముద్రపు నీటిలో కరిగి సముద్ర జీవులకు, సూక్ష్మజీవులకు రక్షణ కవచంలా నిలుస్తుందని నిరూపించింది. ఈ అద్భుత ఆవిష్కరణకు రాజీ ‘అమెరికాస్‌ టాప్‌ యంగ్‌ సైంటిస్ట్‌ 2026’ టైటిల్‌తో పాటు 25 వేల డాలర్ల (సుమారు రూ. 21 లక్షలు) బహుమతిని గెలుచుకుంది. ‘భవిష్యత్తులో నాసా ఇంజనీర్‌గా మారి, అంతరిక్షం నుంచే సముద్రాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వ్యవస్థలను తయారు చేయాలన్నది నా కల‘ అని రాజీ తన ఆశయాన్ని పంచుకుంది.

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)