Breaking News

టోకు ధరలకు ఇంధన సెగ!

Published on Tue, 11/17/2026 - 05:01

న్యూఢిల్లీ: ఇంధనం, విద్యుత్, ఆహారేతర వస్తువుల ధరల మంటతో టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) భారీగా ఎగబాకింది. అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ సూచీ ఏకంగా 12.29 శాతానికి జంప్‌ చేసింది. 2022–23 బేస్‌ సంవత్సరంగా డబ్ల్యూపీఐ సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత సూచీ ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. సెపె్టంబర్‌లో ఇది 11.39 శాతంగా ఉంది. 

అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగొస్తున్న నేపథ్యంలో నవంబర్‌లో టోకు ధరలు కాస్త శాంతించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కాగా, ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం సెపె్టంబర్‌లో 8.14 శాతం నుంచి అక్టోబర్‌లో 8.26 శాతానికి పెరిగింది. ఆహారేతర వస్తువుల ధరల పెరుగుదల 10.28 శాతం నుంచి 11.69 శాతానికి ఎగసింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇంధనం, విద్యుత్‌ ధరల ద్రవ్యోల్బణం 25.85 శాతం నుంచి 32.84 శాతానికి దూసుకెళ్లింది.

రేట్ల పెంపునకు ఆజ్యం..: అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత గరిష్ట పరిమితికి (2–6 శాతం) మించి రెండేళ్ల గరిష్ట స్థాయిలో 6.09 శాతానికి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టోకు ధరలు కూడా డబుల్‌ డిజిట్‌ స్పీడ్‌లో పెరిగిపోవడం చూస్తుంటే.. వడ్డీరేట్లకు మరింత రెక్కలు రావడం ఖాయమని ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్‌లో (2–4 మధ్య) జరగనున్న ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో రెపో రేటు పావు శాతం పెంపు (5.75 శాతానికి) ఉంటుందని, ఆ తర్వాత కాస్త విరామం ఇవ్వొచ్చని బ్రిక్‌ వర్క్స్‌ రేటింగ్స్‌ఎకనమిస్ట్‌ ప్రాంజల్‌ ఘటే అంచనా వేశారు.

 

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)