YSRCPలోకి భారీగా చేరికలు..
Breaking News
చాచా నెహ్రూ అని ఎవరు మొదట పిలిచారు?
Published on Sat, 11/14/2026 - 00:55
భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు గులాబీ పువ్వులన్నా, చిన్నపిల్లలన్నా ప్రాణం. ప్రధానిగా ఎంత బిజీగా ఉన్నా పిల్లలు కనిపిస్తే చాలు ఆయనలో కొత్త ఉత్సాహం వచ్చేది. ‘నేటి బాలలే రేపటి పౌరులు. మనం వాళ్లను పెంచే విధానమే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది’ అని ఆయన బలంగా నమ్మేవారు.
పిల్లలను ప్రేమతో, సరైన విద్యతో పెంచితేనే గొప్ప సమాజం తయారవుతుందని ఆయన ఆశించేవారు. స్వాతంత్య్ర ఉద్యమకాలం నుంచే మహాత్మా గాంధీని ప్రజలు ‘బాపూ’ (తండ్రి) అని ఆ ప్యాయంగా పిలిచేవారు. గాంధీజీకి అత్యంత సన్నిహితుడు, ఆయన రాజకీయ వారసుడు కావడంతో నెహ్రూను ‘చాచా’ (చిన్నాన్న/బాబాయి) అని పిలవడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా 1950లలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు, బహిరంగ సభలకు వెళ్లినప్పుడల్లా పిల్లలు ఆయన చుట్టూ చేరి ‘చాచా నెహ్రూ’ అంటూ గులాబీలు ఇచ్చేవారు.ఆ పిలుపులోని ఆత్మీయత నెహ్రూకు ఎంతగానో నచ్చింది. ఆ పిలుపు దేశమంతా స్థిరపడి పోయింది. ఆయన జన్మదినమే బాలల దినోత్సవం అయ్యింది.
Tags : 1