Breaking News

మాయలేడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Published on Fri, 11/13/2026 - 14:08

టైటిల్: మాయలేడి
నటీనటులు : రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, సత్య, ఇంద్రజ, సురేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
దర్శకుడు : ప్రశంకర్
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
విడుదల తేదీ: నవంబర్ 13 , 2026 

రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు 'మాయలేడి' అని మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. 

కథ ఏంటంటే?
క్రిష్(రాకేష్ ) సెల్ఫ్ డిఫెన్స్ కోచ్. తొలిచూపులోనే ఆశ(మధుమిత సర్కార్)తో ప్రేమలో పడుతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకి చెప్పాలని ప్రయత్నిస్తున్న క్రమంలో క్రిష్ జీవితంలోకి రూప(మధుమిత సర్కార్) వస్తుంది. ఆమెను ఆశ అనుకొని ప్రేమించడం మొదలుపెడతాడు. అయితే ఒక రోజు క్రిష్ కి తనతో ఉన్న అమ్మాయి ఆశ కాదని.. ఆశకి ఉన్న మరో సమస్య గురించి కూడా తెలుస్తుంది. అదేంటి? ఆశ అనుకొని రూపకి దగ్గర అయిన క్రిష్. చివరకి ఎవరిని ప్రేమిస్తాడు? క్రిష్ ని ఇష్టపడిన రూప... చివరకు ఏం చేసింది? ఆశ, రూప ల మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆశ సమస్యను క్రిష్ ఎలా తీర్చాడు? ఈ కథలో ఇంద్రజ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే?
కామెడీ, రొమాన్స్‌, సస్పెన్స్‌, ఎమోషన్స్‌ను కలిపి దర్శకుడు ప్రసాంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ అన్ని అంశాలు ఒకే స్థాయిలో వర్కవుట్‌ కాలేదు. ప్రేమకథతో పోలిస్తే కామెడీ ట్రాక్‌ కొంత  బలంగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కథలో సహజంగా కలిసిపోలేదు. కామెడీ ఎపిసోడ్లు వరకు నవ్వించాయి. దీంతో కథనం అక్కడక్కడా నెమ్మదిగా సాగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. కథలో ట్విస్టులు బాగున్నాయి. కానీ కథనం నెమ్మదిగా సాగడంతో దాన్ని పూర్తిగా ఆస్వాదించలేం.

అమ్మాయిలకు ఆత్మ రక్షణ శిక్షణ ఇచ్చే వ్యక్తిగా హీరోని పరిచయం చేసిన దర్శకుడు.. ఆ వెంటనే అసలు కథలోకి వెళ్ళాడు.  ఆశతో పరిచయం... రూప ఎంట్రీ... ఆశ, రూప వేరువేరని హీరోకు తెలిసే వరకు కథనం రొటీన్ గానే సాగుతుంది. ఎప్పుడైతే రూప గురించి తెలుస్తుందో .. అప్పటినుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది.  రూప పాత్ర చేసే అల్లరి పనులు, ఈ క్రమంలో సత్య వేసే పంచులతో ఫస్టాఫ్ కొంత ఎంటర్టైనింగ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్  బాగుంటుంది. సెకండాఫ్ మొత్తం ఆశ గతం... ఆమె ఉన్న ఆరోగ్య సమస్య  చుట్టూ కథనం తిరుగుతుంది. అయితే ఆశ ఆరోగ్య సమస్య తెలిసిన తర్వాత కథనం రొటీన్ గా , ఊహకు అందేలా సాగుతుంది. సత్య కామెడీ కొంత ఉపశమనం కలిగిస్తుంది. ప్రేమకథ కంటే కామెడీ, ట్విస్టులే ఎక్కువగా వర్కవుట్‌ అయ్యాయి.  ఎమోషనల్ సన్నివేశాలను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే?
క్రిష్‌ పాత్రలో రాకేశ్‌ వర్రే సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోచ్‌గా యాక్షన్‌ సన్నివేశాల్లోనూ మెప్పించారు. అయితే సినిమాకు ప్రధాన బలం మధుమిత సర్కార్‌ అని చెప్పొచ్చు. ఆశా, రూపా అనే భిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రలను ఆమె పోషించిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సత్య తన కామెడీ టైమింగ్‌తో సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా అతడి వన్‌లైనర్లు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి.

టెక్నికల్‌ విషయాలకు వస్తే విశాల్‌ చంద్రశేఖర్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు.యెదు రాధాకృష్ణన్‌ సినిమాటోగ్రఫీ, రవితేజ గురిజాల ఎడిటింగ్‌ సినిమాకు అవసరమైన స్థాయిలో సహకరించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు