Breaking News

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు!

Published on Fri, 11/13/2026 - 12:56

మైక్రోసాఫ్ట్ సర్వర్లలో ఏర్పడిన సమస్య.. ఇప్పుడు విమానయాన రంగంపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే అవుట్‌లుక్‌, టీమ్స్ వంటి సేవలు పనిచేయక యూజర్లు ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా భారత్‌లో కొన్ని విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది.

మూడు విమానాలు రద్దు
స్పైస్‌జెట్‌కు చెందిన మూడు విమానాలను శుక్రవారం ఉదయం రద్దు చేశారు. ఢిల్లీ నుంచి పుణె, లేహ్, ముంబై వెళ్లాల్సిన విమానాలు ఈ సాంకేతిక సమస్య కారణంగా రద్దయ్యాయి. అంతేకాకుండా.. ఢిల్లీ నుంచి దర్భంగా, ముంబై వెళ్లాల్సిన మరో రెండు విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎయిర్ ఇండియా ఊరట
అయితే.. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చింది. మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని నిశితంగా గమనిస్తున్నామని, ప్రస్తుతం తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది. తమ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా సాధారణంగానే పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రయాణికుల నుంచి వచ్చే ఈమెయిల్స్ మిస్ కాకుండా ఉండేందుకు వాటిని తాత్కాలికంగా మరో మార్గం ద్వారా మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా 24 గంటల్లోనే ఈమెయిల్స్‌కు సమాధానం ఇస్తున్నామని పేర్కొంది.

ఇండిగో, ఆకాసా ఎయిర్ ఇలా..
ఇక ఇండిగో, ఆకాసా ఎయిర్ సంస్థలు కూడా ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సమయాలు, రాకపోకలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. ఢిల్లీ విమానాశ్రయం కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్‌ను ఒకసారి పరిశీలించాలని తెలిపింది. ఎందుకంటే సాంకేతిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో విమానాల షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

మైక్రోసాఫ్ట్ సమస్య కారణంగా.. పలు సేవల్లో అంతరాయం ఏర్పడింది.దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్.. సాంకేతిక సమస్యను గుర్తించామని, పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది. సర్వర్లలో ఏర్పడిన సమస్య కారణంగా కనెక్టివిటీ ఇబ్బందులు తలెత్తినట్లు వెల్లడించింది.

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు