Breaking News

‘10-12 గంటలు పని.. కాసేపు కూర్చోనిద్దాం’

Published on Thu, 11/12/2026 - 14:17

విమానాశ్రయాలు, లాంజ్‌లు, హోటళ్లు, ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగంలో పనిచేసే ఫ్రంట్‌లైన్ సిబ్బంది పడుతున్న శ్రమపై ప్రముఖ నటుడు సోనూ సూద్‌ కీలక విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్టు కౌంటర్లు, హోటల్ రిసెప్షన్లు, సర్వీస్ డెస్క్‌ల వద్ద ఉద్యోగులు దాదాపు 10 నుంచి 12 గంటల పాటు నిరంతరం నిలబడి విధులు నిర్వర్తించాల్సి వస్తోందని, వారి కఠినమైన పనివేళల పట్ల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు.

కొద్దిపాటి విశ్రాంతి

విమానాశ్రయాలకు వెళ్లినప్పుడు లేదా హోటళ్లకు చేరుకున్నప్పుడు మనకు చిరునవ్వుతో స్వాగతం పలికే సిబ్బందిని గమనిస్తుంటాం. కానీ అదే సిబ్బంది రోజంతా నిలబడి పనిచేయడం వల్ల ఎంతటి శారీరక ఇబ్బందులు, అలసటను ఎదుర్కొంటారనే కోణంలో ఎప్పుడైనా ఆలోచించామా? అని సోనూ సూద్‌ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పని ఒత్తిడి మధ్య వీలు కుదిరిన సమయంలో సిబ్బంది కూర్చునేందుకు వీలుగా ప్రతి వర్క్‌ప్లేస్‌లోనూ తగిన హై స్టూల్స్ లేదా సరైన సీటింగ్ ఏర్పాట్లు కల్పించాలని ఆయన సూచించారు. కొద్దిపాటి విశ్రాంతి అనేది ఏదో ప్రత్యేకమైన ప్రివిలేజ్ (అరుదైన అవకాశం) కాదని, అది ప్రతి ఉద్యోగికి దక్కాల్సిన కనీస గౌరవం అని స్పష్టం చేశారు.

ఆతిథ్య రంగంలో నైతిక బాధ్యత

హాస్పిటాలిటీ రంగం పూర్తిగా కస్టమర్ల సౌకర్యాలు, సంతృప్తి చుట్టూ తిరుగుతుంది. హోటళ్లలో అతిథుల కోసం సౌకర్యవంతమైన గదులు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో ప్రీమియం సీటింగ్ సదుపాయాలు కల్పించే యాజమాన్యాలు.. అదే సేవలను అందించే సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులకు తగిన సీటింగ్ సదుపాయాలు కల్పించడం వల్ల సేవా నాణ్యత ఏమాత్రం తగ్గదని, పైగా ఇది ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని సోనూ సూద్ వాదిస్తున్నారు. కస్టమర్ల అనుభవం, ఉద్యోగుల సంక్షేమం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వ్యాపార సంస్థలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)