Breaking News

బెస్ట్‌ స్క్రబ్‌ : మృదువైన పాదాలకు..

Published on Thu, 11/12/2026 - 13:16

చాలామంది  పాదాలను పట్టించుకోరు. కానీ రోజంతా చెప్పులు, బూట్లతో ఉండటం వల్లపాదాలపై మురికి పేరుకు పోతుంది. 
చర్మం  పొడిబారి గరుకుగా మారుతుంది. ముఖ్యంగా మడమల దగ్గర పగుళ్లు, మృతకణాలు ఇబ్బంది పెడతాయి. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఇంట్లోనే మూడు రకాల  ఫుట్‌ స్క్రబ్స్‌ తయారుచేసుకోవచ్చు.

కాఫీ స్క్రబ్‌
కావలసినవి: నాలుగు టేబుల్‌ స్పూన్ల కాఫీ  పొడి, మూడు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌  పొడి, మూడు టేబుల్‌ స్పూన్ల కల్లుప్పు, మూడు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ నూనె, రెండు చుక్కల లావెండర్‌ నూనె.
తయారీ: అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తడి పాదాలకు రాసి వృత్తాకారంలో మృదువుగా మర్దన చేయాలి. గోరువెచ్చని నీటితో కడిగి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి.

నిమ్మకాయ స్క్రబ్‌
కావలసినవి: ఒక కప్పు బ్రౌన్‌ షుగర్,పావు కప్పు బాదం నూనె లేదా కొబ్బరి నూనె, నాలుగు నుంచి ఐదు చుక్కల నిమ్మ ఎసెన్షియల్‌ ఆయిల్‌.

తయారీ: అన్ని పదార్థాలను కలిపి చిక్కటి మిశ్రమంలా తయారుచేయాలి. పాదాలకు రాసి ఐదు నిమిషాలపాటు మృదువుగా మర్దన చేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె.. పుదీనా స్క్రబ్‌
కావలసినవి: అర కప్పు కల్లుప్పు, అర కప్పు బాదం నూనె, పావు కప్పు స్వచ్ఛమైన తేనె, ఒక టీ స్పూన్‌  వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్, పది చుక్కల పుదీనా ఎసెన్షియల్‌ ఆయిల్, అర కప్పు బ్రౌన్‌  షుగర్‌.

తయారీ: అన్ని పదార్థాలను బాగా కలపాలి. తడి పాదాలకు ఈ మిశ్రమాన్ని రాసి ఐదు నిమిషాల  ;eటు మృదువుగా మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. స్క్రబ్‌ తర్వాత మాయిశ్చరైజర్‌ రాసుకుంటే పాదాలు తేమగా ఉంటాయి. 

 


 

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)