Breaking News

మమ్ముట్టి, మోహన్‌లాల్ గ్యారేజీలోకి కొత్త కార్లు.. రెండూ ఒకటే బ్రాండ్!

Published on Thu, 11/12/2026 - 09:38

మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న మమ్ముట్టి, మోహన్‌లాల్‌కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే వీరిద్దరి దగ్గర ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే.. తాజాగా తమ కార్ల కలెక్షన్‌లో కొత్త లగ్జరీ కార్లను చేర్చారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఇద్దరూ లెక్సస్ బ్రాండ్ కార్లనే కొనుగోలు చేయడం. మమ్ముట్టి లగ్జరీ సెడాన్‌ను ఎంచుకోగా, మోహన్‌లాల్ మాత్రం ఖరీదైన లగ్జరీ ఎంపీవీ సొంతం చేసుకున్నారు.

మమ్ముట్టి కారు
మమ్ముట్టి కొనుగోలు చేసిన కారు లెక్సస్ ఈఎస్ 350హెచ్. ఈ కారు ప్రారంభ ధర రూ.66.10 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇది చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, లోపల కూడా అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 14 అంగుళాల టచ్‌స్క్రీన్, ప్రీమియం ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్‌అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం ఏడీఏఎస్ టెక్నాలజీని కూడా అందించారు.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.5 లీటర్ల పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ ఉంది. ఇది 244 పీఎస్ పవర్, 270 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. e-CVT గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. అంటే మంచి పనితీరుతో పాటు ఇంధన పొదుపునకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.

మోహన్‌లాల్ కారు
మోహన్‌లాల్ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారును ఎంచుకున్నారు. ఇది లెక్సస్ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ఎంపీవీ. టయోటా వెల్‌ఫైర్ ఆధారంగా రూపొందించిన ఈ కారు భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎంపీవీలలో ఒకటిగా నిలుస్తోంది.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ అనేది ఆకట్టుకునే డిజైన్ పొందింది. ముందు భాగంలో భారీ గ్రిల్, సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, వెనుకవైపు కారు వెడల్పు అంతటా ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్లు కూడా ఉన్నాయి.

ఈ కారును నాలుగు సీట్లు, ఏడు సీట్ల ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా నాలుగు సీట్ల మోడల్‌లో ముందు, వెనుక సీట్ల మధ్య ప్రత్యేక విభజన ఉంటుంది. అవసరాన్ని బట్టి పైకి, కిందికి మార్చుకునే గ్లాస్ ప్యానెల్ కూడా అందించారు. ఈ కారులో ప్రయాణం కూడా.. విమానంలో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్న అనుభూతిని ఇస్తుంది.

ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వివాదం.. వెలుగులోకి మరో సంచలన విషయం!

వెనుక ప్రయాణికుల కోసం విలాసవంతమైన రిక్లైనర్ సీట్లు, 48 అంగుళాల టీవీ, 23 స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఫోల్డింగ్ టేబుళ్లు, ఫ్రిజ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా వేడిని అందించే ఆర్మ్‌రెస్టులు, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, గొడుగు పెట్టుకునే ప్రత్యేక స్థలం వంటి చిన్న చిన్న సౌకర్యాలపైనా కంపెనీ దృష్టి పెట్టింది. ఏడీఏఎస్ భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)