Breaking News

పాల పాకెట్ల ధరలు పెంపు.. రేపటి నుంచే కొత్త రేట్లు!

Published on Wed, 11/11/2026 - 19:49

సామాన్యులపై మరోసారి పాల ధరల భారం పడనుంది. ప్రముఖ డెయిరీ సంస్థలు అమూల్‌, మదర్‌ డెయిరీ తమ పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. నవంబర్‌ 12, గురువారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పాల రకాన్ని బట్టి లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు ధరలు పెరగనున్నాయి.

అమూల్‌ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) తాజా ధరల సవరణను ప్రకటించింది. అమూల్‌ తాజా, గోల్డ్‌, శక్తి, టీ స్పెషల్‌ వంటి ప్రధాన వేరియంట్లపై ఈ పెంపు ప్రభావం చూపనుంది. కొత్త ధరల ప్రకారం అమూల్‌ తాజా టోన్డ్‌ పాలు లీటరు రూ.62కు, అమూల్‌ గోల్డ్‌ ఫుల్‌ క్రీమ్‌ పాలు రూ.80కు చేరనున్నాయి. అంటే వీటి ధరలు వరుసగా రూ.2, రూ.4 చొప్పున పెరగనున్నాయి.

ధరల పెంపునకు పశువుల దాణా, పాల సేకరణ, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, ఇంధన రవాణా ఖర్చులు పెరగడమే కారణమని అమూల్‌ వెల్లడించింది. తక్కువ, అసమాన వర్షపాతం వల్ల పశుగ్రాసం లభ్యతపైనా ప్రభావం పడిందని తెలిపింది. రైతులకు చెల్లించే పాల సేకరణ ధరలను గత ఏడాది కాలంలో సభ్య సంఘాలు 4-5 శాతం పెంచాయని పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయంలో సుమారు 80 శాతం 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు తిరిగి అందిస్తున్నట్లు వివరించింది.

ఇదిలా ఉండగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్‌ డెయిరీ కూడా లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు ధరలు పెంచింది. సవరించిన ధరలు నవంబర్‌ 12 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త ధరల ప్రకారం ఫుల్‌ క్రీమ్‌ పాలు లీటరు రూ.76కు (గతంలో రూ.72), ప్యాకెట్‌ టోన్డ్‌ పాలు రూ.62కు (రూ.60), డబుల్‌ టోన్డ్‌ పాలు రూ.56కు (రూ.54) చేరనున్నాయి. ఆవు పాలు లీటరు రూ.65కు (రూ.62), బల్క్‌ టోన్డ్‌ పాలు రూ.60కు (రూ.58) పెరగనున్నాయి.

మదర్‌ డెయిరీ రోజుకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ విక్రయాలు 50 లక్షల లీటర్లకు పైగా ఉన్నాయి. రైతుల నుంచి పాల సేకరణ ధరలు పెరగడంతోనే వినియోగదారులపై కొంత భారాన్ని మోపాల్సి వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మే 14 తర్వాత మదర్‌ డెయిరీ చేపడుతున్న రెండో ధరల సవరణ ఇది. అమూల్‌ కూడా ఈ ఏడాది మే తర్వాత తొలిసారిగా తాజా పాల ధరలను సవరిస్తోంది.

 

ఇదీ చదవండి: బెంగళూరులో అద్దె ఇల్లు.. వింత షరతులు!

 

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)