Breaking News

అక్టోబర్‌లో ఈవీల అమ్మకాలు ఎంతంటే..

Published on Wed, 11/11/2026 - 08:09

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈవీ అమ్మకాలు ఏకంగా 45 శాతం పెరిగి 3,54,625 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 2,44,764 యూనిట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధి అని ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ‘ఫాడా’ వెల్లడించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన విక్రయాలు 1,50,890 నుంచి 48.49% పెరిగి 2,24,064 యూనిట్లను తాకాయి. దీంతో మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఈ–టూవీలర్ల వాటా 4.7% నుంచి ఏకంగా 9.7 శాతానికి విస్తరించింది.

మరోవైపు ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాలు 76.47% దూసుకెళ్లి 37,049 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ విభాగంలో మార్కెట్‌ వాటా 3.5% నుంచి 7.3 శాతానికి ఎగబాకింది. ఇక ఎలక్ట్రిక్‌ త్రీ–వీలర్‌ సేల్స్‌ 24.76% వృద్ధితో 88,570 యూనిట్లకు చేరాయి. ప్రస్తుతం త్రిచక్ర వాహన విభాగంలో ఏకంగా 63% వాటా విద్యుత్‌ వాహనాలదే కావడం విశేషం. ‘‘దేశంలో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల పెనిట్రేషన్‌ గతేడాది 6% ఉండగా, ఈసారి 11.5 శాతానికి చేరింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉండటం, మరోవైపు ఈవీల రేంజ్‌ మెరుగుపడటంతో పాటు పెట్రోల్‌ వాహనాలకు సమానంగా ఈవీ ధరలు అందుబాటులోకి రావడమే ఈ భారీ డిమాండ్‌కు కారణం. మార్కెట్‌లో సప్లై కంటే డిమాండే ఎక్కువగా ఉంది’’ అని  ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ‘దుస్తులు ధరించని సమయాల్లో రికార్డు చేస్తున్నారు!’

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)