Breaking News

పసిడి పుట్ట పగిలిందా! బంగారం బుసలకు కారణం ఏంటి?

Published on Thu, 11/05/2026 - 18:29

ఇంత కాలం బంగారం ధరలు దిగివస్తుంటే హమ్మయ్య కాస్త పసిడినైనా కొనుక్కోవచ్చులే అని పుత్తడి ప్రియులు ఆనందించారు. అయితే వారి ఆశలను అడియాసలు చేస్తూ బంగారం ధరలు బుసలు కొడుతున్నాయి. రెండు రోజులుగా పసిడి ధరలు అంత భారీగా పెరగడానికి అసలు కారణాలు ఏంటన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..

అమెరికా రాజకీయ పరిణామాలు, డాలర్ బలహీనత, ట్రెజరీ బాండ్లపై తగ్గిన రాబడులు.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి మళ్లీ ఊపునిచ్చాయి. వరుస పతనాలతో ఇబ్బందిపడ్డ పసిడి ఒక్కసారిగా పుంజుకుని రెండు వారాల గరిష్ఠానికి చేరింది. దీంతో బంగారం ధరలు మళ్లీ 4,200 డాలర్ల స్థాయిని అందుకుంటాయా? అనే చర్చ మొదలైంది.

రెండు రోజుల్లోనే భారీ లాభాలు

గురువారం (నవంబర్ 5) అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు 1.9 శాతం పెరిగి 4,134.82 డాలర్లకు చేరుకుంది. ట్రేడింగ్‌ సమయంలో 4,146.63 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. అక్టోబర్‌ 20 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. అంతకుముందు బుధవారం ఒక్కరోజే బంగారం ధరలు 3.4 శాతం ఎగిశాయి. ఆగస్టు 19 తర్వాత ఇదే అతిపెద్ద రోజువారీ పెరుగుదల. గత శుక్రవారం నమోదైన ఏడాది కనిష్ఠ స్థాయి 3,869.85 డాలర్ల నుంచి ఈ వారంలో ఇప్పటివరకు 250 డాలర్లకు పైగా పుంజుకుంది.

బంగారం ధరలకు ఊతమిచ్చిన అంశాలు

బలహీనపడిన అమెరికా డాలర్‌

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత డాలర్‌ ఒక నెలకు పైగా కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. డాలర్‌ బలహీనపడితే ఇతర కరెన్సీలతో బంగారం కొనుగోలు చేసే వారికి అది చౌకగా మారుతుంది. దీంతో పసిడికి డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంటుంది.

తగ్గిన ట్రెజరీ బాండ్ల రాబడులు

అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు తగ్గడం కూడా బంగారానికి అనుకూలంగా మారింది. బంగారం ఎలాంటి వడ్డీ ఆదాయాన్ని ఇవ్వదు. బాండ్లపై రాబడులు తగ్గినప్పుడు బంగారాన్ని కలిగి ఉండటానికి అయ్యే అవకాశ వ్యయం తగ్గుతుంది. దీంతో పెట్టుబడిదారులు పసిడి వైపు మొగ్గు చూపుతారు.

చమురు ధరల పతనం.. ద్రవ్యోల్బణ భయాలు తగ్గడం

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ఇరాన్‌తో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు తగ్గవచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. దీంతో బుధవారం బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు దాదాపు 9 శాతం పడిపోయాయి. గురువారం స్వల్పంగా కోలుకున్నప్పటికీ బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువనే కొనసాగాయి. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గవచ్చు. ఫలితంగా వడ్డీ రేట్లను ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగించాల్సిన అవసరం తగ్గుతుందన్న అంచనాలు బంగారానికి మద్దతునిస్తున్నాయి.

అమెరికా ఎన్నికల ప్రభావం ఏమిటి?

అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో డెమోక్రాట్లకు వచ్చిన భారీ విజయాలు మార్కెట్‌ అంచనాలను మార్చాయి. కాంగ్రెస్‌లో ప్రతిపక్షానికి బలం పెరగడంతో ప్రభుత్వ వ్యయాలు, ఆర్థిక విధానాలపై నియంత్రణలు పెరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది డాలర్‌, బాండ్‌ మార్కెట్లపై ప్రభావం చూపింది. అదే సమయంలో అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గవచ్చన్న ఆశలు చమురు ధరలపై ఒత్తిడి పెంచాయి.

4,400 డాలర్లకు చేరుతుందా?

బంగారం ధరలు కీలకమైన 4,000 డాలర్ల స్థాయిని తిరిగి దాటడంతో మార్కెట్‌ విశ్లేషకులు తదుపరి లక్ష్యాలపై దృష్టి పెట్టారు. XS.com మార్కెట్‌ విశ్లేషకురాలు లిన్‌ ట్రాన్‌ ప్రకారం.. పెట్టుబడుల ప్రవాహాలు, బాండ్‌ రాబడులు బంగారానికి మద్దతుగా కొనసాగితే ఔన్స్‌ ధర 4,000 డాలర్లకు పైన స్థిరపడవచ్చు. అలా జరిగితే తొలుత 4,200 డాలర్లు, ఆ తర్వాత 4,400 డాలర్ల దిశగా పుంజుకునే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు.

ఇకపై ఏ అంశాలు కీలకం?

శుక్రవారం వెలువడనున్న అమెరికా వ్యవసాయేతర ఉద్యోగాల గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. ఈ వివరాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలాన్ని, ఫెడరల్‌ రిజర్వ్‌ తదుపరి వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. ప్రస్తుతం డిసెంబరులో ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచే అవకాశానికి మార్కెట్‌ 79 శాతం ప్రాధాన్యం ఇస్తోంది.

అందువల్ల బంగారం ధరలు 4,000 డాలర్ల పైన నిలదొక్కుకుంటాయా? డాలర్‌, బాండ్‌ రాబడులు మరింత తగ్గుతాయా? అనే అంశాలు తదుపరి దిశను నిర్ణయించనున్నాయి. ఇటీవలి భారీ పతనం తర్వాత వచ్చిన ఈ ర్యాలీ కొనసాగుతుందా లేదా అన్నది రాబోయే ఆర్థిక గణాంకాలపై ఆధారపడి ఉంటుంది.

దేశంలోని ప్రధాన నగరాలలో ఈరోజు బంగారం, వెండి ధరలను ఈ కింద చూడవచ్చు..

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)