Breaking News

వీగన్ల కోసం..గ్రీన్‌ ఫుడ్‌ గ్యాడ్జెట్స్‌..

Published on Sun, 11/01/2026 - 13:23

పాలు వద్దు.. పనీర్‌ వద్దు.. అసలు జంతు ఉత్పత్తుల జోలికే వెళ్లద్దు అనుకునే పక్కా వీగన్ల కోసం మొక్కలతోనే మ్యాజిక్‌ చేసే గాడ్జెట్లు వచ్చేశాయి! నవంబర్‌ 1 ప్రపంచ వీగన్‌ దినోత్సవం సందర్భంగా.., ప్రతి వీగన్‌  వంటను సులభంగా పూర్తి చేసే గాడ్జెట్లే ఇవీ!

బటన్‌ నొక్కితే పాలు! 
మన వంటగదే చిన్న వీగన్‌ డెయిరీ అయిపోతే ఎంతో బాగుంటుంది కదా! అందుకే వచ్చింది ఈ నట్‌ మిల్క్‌ మేకర్‌. దీంతో బాదం, సోయా, ఓట్స్, గింజలతో పాలు తయారు చేసుకోవచ్చు. 600 మి.లీ. సామర్థ్యం ఉన్న ఈ మెషిన్‌లో 600 వాట్ల మోటార్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బ్లేడ్లు ఉంటాయి. పాలు మాత్రమే కాదు, తృణధాన్యాలతోనూ పానీయాలు తయారు చేసుకోవచ్చు. ఇందులో నీళ్లు మరిగించే సదుపాయమూ ఉంది. మొత్తం ఆరు ఫంక్షన్లతో పాటు, ఒకటి నుంచి 12 గంటల వరకు టైమర్‌ సెట్‌ చేసుకునే వీలుంది. వాడిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ప్రత్యేక క్లీనింగ్‌ ఫంక్షన్‌  కూడా ఉంది. ధర రూ.4,000

విత్తనాలే విటమిన్లు!
మార్కెట్‌ చుట్టూ తిరగకుండా ఇంట్లోనే మొలకలు పెంచుకుంటే, విత్తనాలే పోషకాల గనులుగా మారిపోతాయి! ఇందుకోసం ఈ హోమ్‌ స్ప్రౌటింగ్‌ జార్‌ కిట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విత్తనాలు వేస్తే మూడు నుంచి ఐదు రోజుల్లోనే మొలకలు సిద్ధమవుతాయి. మట్టి అవసరం లేదు, తోటపని చేస్తూ చెమటలు చిందించాల్సిన అవసరమూ లేదు! గాలి సులువుగా ప్రసరించే స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ట్యూబ్, అదనపు నీటిని సేకరించే రిజర్వాయర్‌ ఉండటంతో మొలకలు పెంచుకోవడం సులువు. జార్‌ను తెరవకుండానే పై నుంచి విత్తనాలను కడిగే సదుపాయం కూడా ఉంది. సలాడ్లు, శాండ్‌విచ్‌లు, స్మూతీల్లో వేసుకోవడానికి తాజా మొలకలు ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. వాడిన తర్వాత వేరుచేసి శుభ్రం చేసుకోవడమూ సులభమే! ధర రూ.500

ఆకుకూరలకు ఐదు బ్లేడ్లు!
‘ఆలస్యం అమృతం విషం’ అన్నట్లు ఆకుకూర లు ఇచ్చే పోషకాలు అమృతం లాంటివే అయినా, వాటిని  కట్‌ చేయడానికి, ఒలవడానికి ఎంత ఆలస్యం చేస్తే అంత ఇబ్బంది! అందుకే, ఈ కత్తిరింపు తిప్పలన్నీ తొలగించడానికి ఈ హెర్బ్‌ కిచెన్‌ సిజర్‌ బాగా పనిచేస్తుంది. ఇందులోని ఐదు బ్లేడ్లు ఒకేసారి పనిచేసి ఆకుల్ని చకచకా చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తాయి. 

పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల్ని కట్‌ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సలాడ్లు, సూప్‌లు, చట్నీలు, కూరల్లో వేసే పచ్చి ఆకుల్ని సిద్ధం చేయడం కూడా సులువే! కాడల నుంచి ఆకుల్ని వేరు చేయడానికి ప్రత్యేక సాధనం, బ్లేడ్ల మధ్య చిక్కుకున్న ఆకుల్ని తొలగించడానికి క్లీనింగ్‌ దువ్వెన కూడా ఉన్నాయి. వాడిన తర్వాత సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ధర సుమారు రూ.2,000.

 

#

Tags : 1

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)