యాపిల్‌లో భారతీయుడికి కీలక పదవి.. ఎవరీ రాజేష్ అంబటి!

Published on Thu, 10/29/2026 - 17:22

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌లో.. భారతీయ మూలాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 'రాజేష్ అంబటి' కీలక పదోన్నతి పొందారు. సంస్థలో ఇంజినీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. దాదాపు 18 ఏళ్లుగా యాపిల్‌లో పనిచేస్తున్న ఆయన, తన అనుభవం, నైపుణ్యంతో ఈ స్థాయికి ఎదిగారు.

యాపిల్ కంపెనీలో చేపట్టిన నాయకత్వ మార్పుల్లో భాగంగా రాజేష్ అంబటితో పాటు.. లూయీ సాంగునెట్టి, డెరెక్ షేఫర్ కూడా వైస్ ప్రెసిడెంట్లుగా పదోన్నతి పొందారు.

రాజేష్ అంబటి విషయానికి వస్తే.. ఈయన తన కెరీర్‌లో ఎక్కువ భాగం సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అండ్ వైర్‌లెస్ కనెక్టివిటీపై పనిచేశారు. పదోన్నతి పొందక ముందు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్‌గా ఉంటూ.. కంపెనీ కనెక్టివిటీ, సెల్యులార్, శాటిలైట్ సాఫ్ట్‌వేర్‌కు బాధ్యత వహించారు.

అంబటి బాధ్యతలు సాఫ్ట్‌వేర్ తయారీతోనే ముగిసిపోలేదు. సాఫ్ట్‌వేర్ పనితీరును పరిశీలించడం, టెస్టులు నిర్వహించడం, నాణ్యతను నిర్ధారించడం, సమస్యలను గుర్తించి పరిష్కరించడం వంటి కీలక పనుల్లో కూడా ఆయనకు అనుభవం ఉంది. ఈ అనుభవమే సంస్థలో ఉన్నత స్థాయికి ఎదగడానికి తోడ్పడింది.

రాజేష్ అంబటి తన కెరీర్‌ను మోటరోలా సంస్థలో ప్రారంభించారు. 2003 జనవరి నుంచి 2009 నవంబర్ వరకు అక్కడ ఇంజినీరింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2009 అక్టోబర్‌లో యాపిల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మేనేజర్‌గా చేరారు. అప్పటి నుంచి వివిధ బాధ్యతలు చేపడుతూ క్రమంగా తన కెరీర్‌లో ఎదిగారు.

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)