భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!
Breaking News
మొటిమలున్నా ముద్దొచ్చేలా..! సాయిపల్లవి సరికొత్త సౌందర్య పాఠం..
Published on Thu, 10/29/2026 - 13:41
నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉందీ ఈ సినీ తారాగణమంతా. అయితే ఇందులో సీతగా అలరించిన బ్యూటీ సాయిపల్లవి తన సహజత్వం, అద్భుతమైన నటనతోనే కట్టిపడేస్తుందామె. మేకప్‌కి అంతగా ప్రాధాన్యత ఇవ్వని నటి ఆమె. ఈ ముద్దుగుమ్మ సైతం మొటిమలు, రోసేసియా వంటి చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ..వెండితెరపై ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ అందం ప్రమాణాలనే తిరగరాసిందిమె.
సహజత్వం అసలు సిసలైన అందం అని అందరూ గ్రహించేలా చేసిన అద్భుత నటి సాయిపల్లవి. ముందు మన శరీరాన్ని మనం అంగీకరిస్తూ..ఆత్మవిశ్వాసంతో సాగితే తిరిగే ఉండదని చాటి చెప్పి..ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. అంతేగాదు ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అని నమ్మా..అందుకే ప్రేక్షకులు సైతం తను ఎలా ఉందో అలానే అంగీకరించారంటోంది. అయితే మొటిమలు, రోసేషియా కొన్నిసార్లు ఒకేలా కనిపించినప్పటికీ..అవి వేర్వేరు సమస్యలు..వాటి చికిత్సా విధానాలు కూడా వేర్వేరేనని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఆ రెండు చర్మ సమస్యలు ఏంటి, వాటి లక్షణాలు, తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
రోసేసియా అంటే..
ఇది దీర్ఘకాలిక తాపజనక చర్మ పరిస్థితి. ఇది సాధారణంగా ముఖం మధ్యభాగాలైన చెంప, ముక్కు, నుదురు, గడ్డంపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల ముఖం ఎర్రగా మారడం, చర్మం వేడెక్కడం, రక్తనాళాలు కనిపించడం, మొటిమలు, గడ్డలు వంటి ఏర్పడటం వంటివి జరుగుతాయి. ఈ సమస్య వల్ల ముఖం అత్యంత సున్నితంగా మారిపోతుంది.
అంటే..చెంపలు, ముక్కు, నుదురు, గడ్డం వంటి భాగాలు ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ పరిస్థితి వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుందట. కొందరిలో ప్రధానంగా ఎరుపు, చర్మం వేడెక్కడం జరిగితే, మరికొందరిలో వాపుతో కూడిన గడ్డలు, చీము గల బొబ్బలు ఏర్పడతాయి. అయితే ముదురు రంగు చర్మం ఉన్నవారిలో ఎరుపు అంతగా కనిపించకపోవచ్చు.
అందువల్ల నిరంతరం వెచ్చదనం, చికాకు, చర్మ రంగులు తదితర మార్పులు లేదా సంకేతాలను రోసేసియాగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అయితే ఈ సమస్యకు శాశ్వతమైన చికిత్స లేకపోయినా..సరైన చికిత్సతో లక్షణాలను అదుపులో ఉంచి వ్యాధి తీవ్రతను తగ్గించొచ్చని అంటున్నారు.
ఎలా గుర్తిస్తారంటే..
రోసేసియా, మొటిమలు రెండూ ముఖంపై గడ్డలు, వాపును కలిగిస్తాయి కాబట్టి, రోసేసియాను తరచుగా మొటిమలుగా పొరబడతారు. మొటిమలలో సాధారణంగా మూసుకుపోయిన వెంట్రుకల కుదుళ్లు, అధిక నూనె, వాపు ఉంటాయి. ఇది బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, లోతైన గడ్డలు లేదా తిత్తులు తదితరాలుగా వస్తాయి.
అదే రోసేసియ ముఖం ఎర్రబడటం, రక్తనాళాలు వాపుతో కూడిన గడ్డలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది బ్లాక్ లేదా వైట్ హెడ్స్‌ను కలిగించదు. ఈ వ్యత్సాసాన్ని గమనించి చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే రోసేసియలు మొటిమలుగా పరిగణించి చికిత్స అందిస్తుంటారు. దానివల్ల సమస్య మరింత సమస్యాత్మకంగా మారుతుందని చెబుతున్నారు.
రోసేసియా తీవ్రతను పెంచే అంశాలు..
ఇది ఎందుకు వస్తుందనేందుకు కారణాలు తెలియాల్సి ఉంది. పర్యావరణం, జీవనశైలికి సంబంధించినవే కారణాలుగా చెబుతుంటారు వైద్యులు. ఇది కూడా వ్యక్తులను బట్టి మారుతుంటుందట. సూర్యరశ్మి, వేడి, ఒత్తిడి, మసాలా ఆహారాలు, మద్యం వంటివే దీని తీవ్రతకు కారణాలుగా చెబుతున్నారు వైద్యులు.
బయట నుంచి వచ్చి వేడినీటితో చేయగానే ఎర్రగా మారినా, మసాలా ఆహారం తిన్నప్పుడు మార్పులను నిశితంగా గమనించొచ్చు. అయితే అందర్నీ ఒకేవిధంగా ప్రభావితం చేయకపోవచ్చు కూడా. ఒక్కోసారి కొందరికి కొన్ని నిర్ధిష్టమైన ఆహారాలు, అలవాట్లు కూడా కారణం కావొచ్చని చెబుతున్నారు నిపుణులు.
నయమవుతుందా..?..
దీన్ని సరైన చికిత్స, చర్మ సంరక్షణతో అదుపులో ఉంచగలమే గానీ, శాశ్వత నివారణ అనేది లేదట. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు మంచి శుభ్రతను పాటిస్తూ..మాయిశ్చరైజింగ్ వంటివి రాసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతిరోజూ సూర్యరశ్మి నుంచి రక్షణ ఇచ్చే మందులు, లేజర్ చికిత్సలు వంటివి మేలు చేస్తాయి. ఇక్కడ రోసేసియా లక్షణాల తీవ్రత ఆధారంగా వైద్యులు చికిత్స ఇవ్వడం జరగుతుందట. ఒక్కోసారి పైపూత మందులు కూడా సూచిస్తారని చెబుతున్నారు.
కళ్ళను సైతం ప్రభావితం చేయగలదట..
రోసేసియా ఎల్లప్పుడూ చర్మానికే పరిమితం కాదు. కొంతమందికి ఆక్యులర్ రోసేసియా వస్తుంది, దీనివల్ల కళ్ళు పొడిబారడం, గరుకుగా అనిపించడం, చికాకు లేదా నీరు కారడం, అలాగే కనురెప్పల చుట్టూ ఎరుపు, అసౌకర్యం కలుగుతాయి.
అందుకు ముందుగానే వ్యాధిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని అంటున్నారు. నిరంతర కంటి మంట, కాంతికి సున్నితత్వం, కంటి నొప్పి లేదా దృష్టిలో మార్పులు వంటివి బట్టి ఈ సమస్యను గుర్తించాల్సి ఉందంటున్నారు. అలా అని సరైన అంచనా లేకుండా ప్రతిదాన్ని ఈ రోసేసియాకు ఆపాదించొద్దని హెచ్చరిస్తున్నారు కూడా.
ఇదీ చదవండి: హనుమాన్ చాలీసాతోనే రోజు మొదలు..!: రణబీర్ కపూర్
Tags : 1