Breaking News

బ్యాంకింగ్‌ రంగంపై మొండి బాకీల భారం 

Published on Thu, 10/29/2026 - 04:49

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రంగంలో తాజా మొండి బాకీల (ఎన్‌పీఏ) భారం పెరగనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే అన్‌సెక్యూర్డ్‌ రిటైల్‌ రుణాలు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎక్కువగా రుణాలిచ్చిన ప్రైవేట్‌ రంగ బ్యాంకులపై ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంది. రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాజాగా ఎన్‌పీఏలుగా మారే రుణాలు 0.8 శాతంగాను, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో 2.5 శాతంగాను ఉండొచ్చని పేర్కొంది. 

విలువపరంగాచూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాజా మొండి బాకీలు రూ. 1 లక్ష కోట్లుగా, ప్రైవేట్‌ బ్యాంకుల్లో రూ. 1.3 లక్షల కోట్లుగా ఉంటాయనే అంచనాలు నెలకొన్నట్లు వివరించింది. గత రెండేళ్లుగా వాటి మొండి బాకీలు అధిక స్థాయిలో ఉంటున్నాయని నివేదిక వివరించింది. కొత్త మొండిబాకీలు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ బ్యాంకింగ్‌ రంగం మెరుగ్గా, లాభదాయకంగానే ఉంటుందని పేర్కొంది. సానుకూల ప్రొవిజినింగ్, సరిపడేంత మూలధన నిల్వలు ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. నివేదికలో మరిన్ని వివరాలు.. 

→ బ్యాంకింగ్‌ రంగంలో 2026 జూన్‌ నాటికి 1.7 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2027 మార్చి నాటికి దాదాపు అదే స్థాయిలో 1.7–1.8 శాతంగా ఉండొచ్చు. అలాగే నికర ఎన్‌పీఏల నిష్పత్తి 2026 జూన్‌లో 0.4 శాతంగా ఉండగా సుమారు అదే స్థాయిలో 0.4–0.5 శాతంగా కొనసాగవచ్చు.  

→ పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ వృద్ధి ఆరోగ్యకరంగా 15.1–15.9 శాతం మేర ఉంటుంది. విలువపరంగా చూస్తే అదనంగా రూ. 32.3–33.8 లక్షల కోట్ల మేర రుణ వితరణ ఉండొచ్చు. అయితే, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల రిసు్కలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపరంగా సవాళ్లు ఎదురుకావొచ్చని ఇక్రా పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15.9 శాతంగా నమోదైంది.  

→ ద్వితీయార్ధంలో దేశీయంగా మెరుగైన స్థాయిలో డిపాజిట్ల వృద్ధిని సాధించడం కూడా బ్యాంకులకు కీలకాంశంగా ఉంటుంది. వడ్డీ రేట్లు క్రమంగా పెరగనుండటం బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లకు కొంత దన్నుగా నిలుస్తుంది.  

→ బాండ్‌ ఈల్డ్‌లు పెరుగుతుండటం కూడా కార్పొరేట్ల రుణ సమీకరణ నిర్ణయాలను ప్రభావితం చేయొచ్చు. అయితే, కార్పొరేట్‌ రుణాలు నిలకడగా పుంజుకోవడమనేది .. బ్యాంక్‌ రుణాలపై వడ్డీ రేట్లు, బాండ్‌ ఈల్డ్‌ల మధ్య వ్యత్యాసం తగ్గడం మీద ఆధారపడి ఉంటుంది.  

→ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) రెండంకెల స్థాయి వృద్ధిని సాధించడం కొనసాగించవచ్చు. 2027 ఆర్థిక సంవత్సరంలో వాటి ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) 15–17 శాతం, 2028 ఆర్థిక సంవత్సరంలో 14–16 శాతం మేర వృద్ధి చెందవచ్చు. అయితే, వాటి రుణ సమీకరణ వ్యయాలు పెరగవచ్చు. 

→ ప్రస్తుత రుణాల రీఫైనాన్సింగ్, అలాగే వృద్ధి సాధనకు సంబంధించి ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు కలిపి 2027 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 6.9–7.1 లక్షల కోట్ల మేర ఫండింగ్‌ అవసరం అవుతుంది.  

Videos

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)