ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు
Breaking News
హిందుస్తాన్ కోకకోలా ఐపీవో వస్తోంది..!
Published on Tue, 10/27/2026 - 04:59
ముంబై: దేశీ కోకకోలా బాట్లర్ హిందుస్తాన్ కోకకోలా బేవరేజెస్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ వారం కంపెనీ మాతృ సంస్థ హిందుస్తాన్ కోకకోలా హోల్డింగ్స్(హెచ్సీసీహెచ్) క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,500 కోట్లు) సమీకరణకు తెరతీయనున్నట్లు అంచనా.
కంపెనీ 2027 కేలండర్ ఏడాదిలో లిస్టయ్యే వీలున్నట్లు తెలుస్తోంది. లిస్టింగ్‌లో కంపెనీ 10 బిలియన్ డాలర్ల విలువను ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. 1997లో ఏర్పాటైన కంపెనీ 10 రాష్ట్రాలలో 14 బాట్లింగ్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. కోకకోలా, థమ్సప్, ఫాంటా తదితర పానీయాల ప్యాకేజింగ్, పంపిణీ, విక్రయాలను చేపడుతోంది. కాగా.. 2025 జూలైలో జూబిలెంట్ భార్తియా గ్రూప్ హెచ్సీసీహెచ్లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది. మిగిలిన 60 శాతం వాటా కోక కోలా చేతిలో ఉంది.
Tags : 1