జియో షేర్ల కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు.. ప్రపంచ రికార్డు!

Published on Fri, 10/23/2026 - 21:10

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ చరిత్ర సృష్టించింది. ఈ ఇష్యూకు దరఖాస్తుల సంఖ్య కోటి మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఒక ఐపీఓకు కోటికి పైగా దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి అని సంస్థ వెల్లడించింది. ఇష్యూ ముగియడానికి ఇంకా ఐదు గంటల సమయం ఉండగానే ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం. బిడ్డింగ్‌ ప్రక్రియ అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దరఖాస్తులు అందుకున్న ఐపీఓగా వారీ ఎనర్జీస్‌ నిలిచింది. ఆ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు సుమారు 97 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు గతంలో నివేదికలు వెల్లడించాయి. అలాగే, బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బీసీసీఎల్‌ వంటి సంస్థల ఐపీఓలు సుమారు 90 లక్షల దరఖాస్తులతో దేశీయంగా రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఈ రికార్డులన్నింటినీ అధిగమిస్తూ జియో ప్లాట్‌ఫామ్స్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. బిడ్డింగ్‌ ముగిసే సమయానికి తుది దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగి కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసే అవకాశముంది.

ఈ అపూర్వ స్పందన జియో ప్లాట్‌ఫామ్స్‌పై ఇన్వెస్టర్లలో ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని సంస్థ తెలిపింది. సంపద సృష్టిలో సామాన్య భారతీయులకు సైతం భాగస్వామ్యం కల్పించాలన్న దివంగత ధీరూభాయ్‌ అంబానీ వారసత్వాన్ని, ముఖేశ్‌ అంబానీ దార్శనికతను ఈ స్పందన ముందుకు తీసుకెళ్తోందని పేర్కొంది. ఆకాశ్‌ అంబానీ, ఇషా అంబానీల జన్మదినాల సందర్భంగా ఈ ఘనతను ప్రత్యేక కానుకగా అభివర్ణించింది.

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)