ద్రవ్యోల్బణంపై ఐఎంఎఫ్ హెచ్చరిక

Published on Fri, 10/23/2026 - 08:48

దేశీయ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముడిచమురు ధరల ఒత్తిళ్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ హెచ్చరించారు. ఈ పరిణామాల పట్ల పాలసీ రూపకర్తలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత ఆర్థిక స్థితిగతులు, ద్రవ్య విధానాల గురించి వ్యాఖ్యలు చేశారు.

గతంలో ద్రవ్యోల్బణం బలహీనంగా ఉన్నప్పుడు, వృద్ధి రేటు మందగించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం సరైన నిర్ణయమని శ్రీనివాసన్ ప్రశంసించారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆర్బీఐ తగిన సమయానికి స్పందిస్తోందని, రెండో విడత ప్రభావాలు (సెకండ్ రౌండ్ ఎఫెక్ట్స్) ఏ విధంగా ఉంటాయో అంచనా వేసేందుకు కేంద్ర బ్యాంకు వేచి చూసే ధోరణి అవలంబించడం వివేకవంతమైన చర్య అని కొనియాడారు.

క్రూడ్‌ ధరలను తేలికగా తీసుకోరాదు..

ప్రస్తుతం భారత్‌లో ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతంగా అంచనా వేశారని చెప్పారు. ఇది ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం (2 శాతానికి +/-) టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉన్నప్పటికీ ఇది క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల వల్ల కలిగే ఒత్తిళ్లను తేలికగా తీసుకోరాదన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే సంకేతాలు కనిపిస్తే సెంట్రల్ బ్యాంకులు వెంటనే స్పందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను ఆయన ప్రశంసించారు. కొవిడ్ మహమ్మారి, అంతర్జాతీయ యుద్ధాలు, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటి అనిశ్చితులు ఎదుర్కొన్నప్పటికీ కేంద్రం ద్రవ్య లోటును క్రమంగా తగ్గిస్తూ రావడం అభినందనీయమన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా రుణ భారం పెరుగుతున్నందున భవిష్యత్ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు వృద్ధికి అనుకూలమైన ద్రవ్య సుస్థిరత విధానాలను అనుసరించాలని కోరారు. సవాళ్లు ఎదురవుతున్నా రాబోయే రోజుల్లో భారత్ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తుండటం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ పతనం!

#

Tags : 1

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)