Breaking News

విప్రో లాభం ఫ్లాట్‌

Published on Fri, 10/16/2026 - 02:09

న్యూఢిల్లీ: ఐటీ రంగ దేశీ దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై– సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 1 శాతం పైగా నీరసించి రూ. 3,201 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2025–26) ఇదే కాలంలో రూ. 3,246 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 9% ఎగసి రూ. 24,753 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 22,697 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. 

 త్రైమాసికవారీగా(ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే) నికర లాభం 4.5% క్షీణించగా.. ఆదాయం 1% బలపడింది. ఐటీ సర్వీసుల ఆదాయం నామమాత్ర వృద్ధితో 261.15 కోట్ల డాలర్లను తాకింది. ఈ ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో ఈ విభాగం ఆదాయం 257.1–262.5 కోట్ల డాలర్లు ఉండొచ్చని  కంపెనీ తాజాగా అంచనా వేసింది. స్థిర కరెన్సీలో చూస్తే త్రైమాసికవారీగా ఇది –1.5% నుంచి +0.5 శాతానికి సమానం. ఈ కాలంలో మొత్తం డీల్స్‌ 23 శాతం ఎగసి రూ. 259.5 కోట్ల డాలర్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. 6,716 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,36,328కు చేరింది. 

పెట్టుబడి ఫలితాలు 
వ్యూహాత్మకంగా చేపట్టిన పెట్టుబడులు ఫలితాలనివ్వడం ప్రారంభించినట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. కొత్త క్లయింట్లు, మార్కెట్లను గెలుపొందేందుకు తమ సామర్థ్యాలను ఇవి మెరుగుపరుస్తున్నట్లు తెలియజేశారు. ఏఐ దీర్ఘకాలిక వృద్ధి చోదకంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 1,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నట్లు వెల్లడించారు.  
ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు 1.6% బలపడి రూ. 174 వద్ద ముగిసింది.
 

#

Tags : 1

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)