ఆడుతూ..ఇతిహాసాలు వినేద్దాం ఇలా..!

Published on Wed, 10/14/2026 - 11:05

‘‘ఒకప్పుడు రామాయణం వినాలంటే అమ్మమ్మ దగ్గర కూర్చునేవారు. మహాభారతం తెలుసుకోవాలంటే తాతయ్య చెప్పే కథలు వింటూ ఊ కొట్టేవారు. ఆ తర్వాత ఎన్నో వేదికలు మారాయి. ఇప్పుడు ఆ కథా గుచ్చాల్ని డిజిటల్‌ రూపంలో అందిస్తున్నాం’’ అని తెలిపారు ‘లిపి ఎపిక్‌’ డిజిటల్‌ నిర్వాహకులు విద్యాసాగర్‌ అనిసింగరాజు.   

గతంతో పోల్చితే నేటి తరానిది ఓ కొత్త సమస్య. ఇతిహాసాల మీద తీసిన సీరియళ్లు, సినిమాలు, వచ్చిన అనేకానేక పుస్తకాలు .. కథల కల్పితాలతో ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ‘దీనిని గమనించి ఒక తరం విస్మరించిన వాస్తవాల మూలాలకు వెళ్లి మరీ తీసుకువచ్చే ప్రయత్నం చేశాం’ అని తెలిపారు లిపి డైరెక్టర్‌ చాగంటి ప్రసాద్‌. 

‘దాదాపు రెండేళ్ల΄పాటు దీనిని వెలుగులోకి తీసుకురావడానికి అనుభవజ్ఞులతో కలిసి కసరత్తు చేశాం. సుమారు 500 మందితో నేరుగా మాట్లాడాం. వారిలో చాలామందికి రామాయణ, భారత, భాగవతాల గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ చదవడానికి, నేర్చుకోవడానికి సమయం, ఓపిక ఉండట్లే దు. దాంతో నిమిషంలోనే ఇతిహాసాలతో కనెక్ట్‌ అయ్యే మార్గం కనుక్కున్నాం. 

అదే దీనికి మొదటి మెట్టు’ అంటారు వైస్‌ప్రెసిడెంట్‌ అపర్ణ.  తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఉత్తర భారతదేశంలో మూడు వేల మంది స్కూల్‌ పిల్లలకు ఉచితంగా డిజిటల్‌ రూపంలో చేరువయ్యే ప్రయత్నం చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్కూళ్లకు తమ కృషిని అందించనున్నామని,  లక్ష యూజర్లకు చేరువవుతున్నామని వివరించారు. 

చూడచ్చు.. ఆడచ్చు ... డిజిటల్‌ రూపంలో ఉన్న ఈ కథనాలను ఒకేసారి చదవచ్చు, వినచ్చు, చూడచ్చు. ఆడచ్చు. పాత్రల చుట్టూ ఉన్న బంధాల గురించి, ఆ మేధస్సు గురించి తెలుసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో రామాయణ మహాభారతాలను దశలవారీగా తెలుసుకునే అవకాశం ఉంది. చిన్న కథలు రోజువారీగా నేర్చుకునేందుకు, వివరణాత్మక కథలు మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు, ఆడియో కథలు వినేందుకు ఉపయోగపడతాయి. క్విజ్‌ల ద్వారా నేర్చుకున్న విషయాలను పరీక్షించుకోవచ్చు.  

ఒకే వేదిక... పిల్లలు మొబైల్‌ స్క్రీన్‌లలో తలలు దూర్చి గంటల తరబడి వీడియో గేమ్స్‌ ఆడుతుంటారని పేరెంట్స్‌ కంప్లైంట్‌. అందువల్లే చదువు మీద ఆసక్తి పోయిందని టీచర్లూ చెబుతుంటారు. అదే వారి మొబైల్‌లో ఈ గేమ్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుంటే రామాయణ, మహాభారతాలను గేమ్స్‌ ద్వారా తెలుసుకుంటూ మేధోవికాసం దవచ్చు. 

ఒక విద్యార్థికి క్విజ్‌గానూ, మరోవ్యక్తికి కథ రూపంలోనూ ఒకే వేదిక ద్వారా భిన్నరూపాలలో ఇతిహాసాల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఆడియో కథలను పిల్లలకు వినిపించవచ్చు. ఉపాధ్యాయులు సాంస్కృతిక అంశాలను చర్చకు తీసుకురావచ్చు. పెద్దలు తమకు తెలిసిన కథలను గుర్తుచేసుకోవచ్చు. ఈ విధంగా లిపి కుటుంబంలో తరాల మధ్య కథలకు వారధిగా మారుతుంది.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

అనుభవజ్ఞులు, ఇతిహాసాల మూలాలు 
తెలిసిన పండితుల నుంచి మూలాల్లో ఉన్న వాస్తవ కథనాలను పొందుపరిచాం. జీవితపు విలువలను, మేధోశక్తికి కావల్సిన పరిజ్ఞానపు భాండాగారాన్ని అందిస్తున్నాం.
– చాగంటి ప్రసాద్, డైరెక్టర్, లిపి ఎపిక్స్‌  

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)