Breaking News

'పర్ఫెక్ట్ డాడీ'! సూర్య పేరెంటింగ్‌ శైలిపై జ్యోతిక ప్రశంసల జల్లు

Published on Sun, 10/11/2026 - 14:25

కోలీవుడ్‌ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన పాత్రలతో మెప్పించి అశేష అభిమానులను సొంతం చేసుకున్న నటుడు. కేవలం రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా సూర్య నూటికి నూరు మార్కుల సంపాదించుకున్నారు. ఆ విషయాన్ని ఆయన భార్య, నటి జ్యోతికి స్వయంగా చెబుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జీవితంలో కూడా మ​ంచి సింగం అని కితాబిచ్చేస్తూ..సూర్య పెంపకశైలిపై పలు ఆసక్తికిర విషయాలు పంచుకున్నారామె. మరి అవేంటో చూద్దామా..!.

హీరో సూర్య తండ్రిగా కూడా మంచి మార్కులే కొట్టేశాడని అంటున్నారామె. తన ఇద్దరి స్కూల్‌ బాధ్యతల్ని ఆయనే స్వయంగా చూసుకుంటారని జ్యోతిక చెప్పుకొచ్చారు. ఆయన గొప్ప తండ్రి అని అంటోంది. తన కూతురు దియా అంటే సూర్యికి చాలా ఇష్టమని అన్నారు. దేవ్‌ మాత్రం మా ఇద్దరికి దగ్గరగా ఉంటాడన్నారు. తమ పిల్లల పాఠశాల నుంచి రెండు మెయిల్స్‌ వస్తుంటాయని, అవి క్రీడలు, విహారయాత్రలు లేదా చదువుకి సంబంధించివని అన్నారామె. అయితే ఆ బాధ్యతలన్నీ సూర్యనే స్వయం చూసుకుంటాడని చెప్పారు. 

ఏది మిస్‌ అవ్వనివ్వరూ ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకుంటాడని చెప్పుకొచ్చారు. అంతేగాదు భార్యభర్తలన్నాక..కొన్ని బాధ్యతల్ని పంచుకోవాల్సి ఉంటుందని, అందుకు నిలువెత్తు ఉదాహరణగా సూర్య నిలవడమే గాదు స్ఫూర్తిగా నిలిచారు. రియల్‌లైఫ్‌లో అతడు గొప్ప భర్త, తండ్రి అని పించుకున్నాడు ఈ సింగం. పైగా పేరెంటింగ్‌ విధానంలో తండ్రికి పిల్లలోతో అటాచ్‌మెంట్‌ పెరిగేలా తీసుకోవాల్సిన బాధ్యత కూడా. గుడ్‌ పేరెంటింగ్‌ విధానంలో తండ్రి నిర్వర్తించాల్సిన కీలక బాధ్యతగా చెప్పొచ్చు. అంతేగాదు సూర్య గతంలో కూడా పిల్లలపై మార్కుల భారం మోపద్దని సూచించారు కూడా.

కాగా, సూర్య జ్యోతికల వివాహం జరిగి 20  ఏళ్లు పూర్తైయిన సందర్భ్యంగా ఇటీవల మరోసారి క్రైస్తవ పద్ధతిలో పరిణయమాడిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ..మా 20 ఏళ్ల ‍ప్రేమ పోరాటాన్ని పురస్కరించుకుని చేసుకున్న ప్రమాణాల పునరుద్ధరణ ఇది. కేవలం వివాహానికి సంబంధించిన వేడుక కాదు. 

ఇది అసంపూర్ణతలు, సర్దుబాటు, అవగాహన, త్యాగాలు, ఒకరినొకరు నిస్వార్థంగా ప్రేమించుకోవడాన్ని జరుపుకున్న వేడుక. మన వేడుక. ఒకరి కోసం ఒకరు ఎలా మారాలో తెలిపే వేడుక ఇది అని పోస్ట్‌ రాసుకొచ్చింది జ్యోతిక.

 

ఇదీ చదవండి: సింగపూర్ ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్‌లో నటి కరీనా లగ్జరీయస్‌ లుక్‌..! ఆ బ్యాగ్‌ ఏకంగా..)

 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)