Breaking News

కొడుకు ఆస్తిపై తండ్రికి హక్కు లేదా?.. చట్టం ఏం చెబుతుందంటే!

Published on Mon, 10/05/2026 - 17:06

కొడుకు సంపాదించిన ఆస్తి విషయంలో.. తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా?, లేక కొడుకు మరణించిన తర్వాత ఆస్తి మొత్తం భార్య, పిల్లలకే చెందుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా.. ఒక వ్యక్తి వీలునామా (Will) రాయకుండా మరణించినప్పుడు ఆస్తి ఎవరికి చెందుతుందనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. ఒక పురుషుడు వీలునామా లేకుండా మరణిస్తే, అతని ఆస్తి ముందుగా క్లాస్-1 చట్టబద్ధ వారసులకు వెళ్తుంది. ఇందులో భార్య, కుమారుడు, కుమార్తె, తల్లి వంటి వారుంటారు. వీరికి సాధారణంగా సమాన వాటాలు లభిస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి భార్య, ఒక కుమారుడు, తల్లి ఉంటే, ఆస్తి మూడు సమాన భాగాలుగా పంచబడుతుందన్నమాట.

కొడుకు ఆస్తిలో తండ్రికి హక్కు ఉండదా?
కొడుకు ఆస్తి విషయంలో తల్లి, తండ్రి హక్కులు ఒకేలా ఉండవు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. తల్లి క్లాస్-1 వారసురాలు, అయితే తండ్రి క్లాస్-2 వారసుడు.

అందువల్ల కొడుకు భార్య, పిల్లలు లేదా తల్లి వంటి క్లాస్-1 వారసులు ఉన్నప్పుడు తండ్రికి వారితో సమానంగా వాటా ఉండదు. క్లాస్-1 వారసులు ఎవరూ లేకపోతేనే క్లాస్-2 వారసుల హక్కు వస్తుంది. కాబట్టి.. కొడుకు ఆస్తిలో తండ్రికి కూడా తప్పనిసరిగా సమాన వాటా ఉంటుంది.. అనుకోవడం సరైనది కాదు.

ఒక అవివాహిత పురుషుడు (కుమారుడు) వీలునామా లేకుండా మరణిస్తే.. అతని ఆస్తి విషయంలో తల్లి క్లాస్-1 వారసురాలిగా ముందుంటుంది. తల్లి కూడా లేకపోతే క్లాస్-2 వారసులకు హక్కు ఉంటుంది.

ఒక వివాహిత పురుషుడు మరణిస్తే.. అతని భార్య, పిల్లలు, తల్లి క్లాస్-1 వారసులుగా పరిగణించబడతారు. ఉదాహరణకు భార్య, ఒక కుమారుడు, తల్లి ఉంటే ముగ్గురికీ ఒక్కొక్క సమాన వాటా వస్తుంది. అంటే పెళ్లైన వ్యక్తి మరణించినంత మాత్రాన అతని ఆస్తి మొత్తం భార్యకే చెందదు.

మహిళ మరణించినప్పుడు పరిస్థితి ఏమిటి?
ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా మరణించినప్పుడు ఆమె ఆస్తి వారసత్వ నియమాలు కొంత భిన్నంగా ఉంటాయి. సాధారణంగా ఆమె పిల్లలు, భర్తకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వారు లేకపోతే తదుపరి చట్టబద్ధ వారసులకు హక్కులు లభిస్తాయి. అందువల్ల పురుషుడు, మహిళ మరణించిన సందర్భాల్లో వారసత్వ నియమాలు పూర్తిగా ఒకే విధంగా ఉండవు. అయితే.. కుటుంబంలో ఆస్తి విషయంలో తగాదాలు రాకుండా ఉండాలంటే.. తప్పకుండా వీలునామా రాయడం మంచిది. 

ఇదీ చదవండి: గోల్డ్ రేటు మళ్లీ పెరుగుతుందా?.. HSBC అంచనా ఇదే!

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)