Breaking News

తయారీ రంగం పరుగులు.. 7 నెలల గరిష్టానికి పీఎంఐ

Published on Fri, 10/02/2026 - 16:23

కొత్త ఆర్డర్లు రావడం దేశీయంగా సెప్టెంబర్‌లో తయారీ రంగంలో ఉత్సాహం నింపింది. దీంతో పరిశ్రమ వృద్ధి ఏడు నెలల గరిష్టానికి ఎగిసింది. ఇందుకు సంబంధించిన హెచ్‌ఎస్‌బీసీ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 55.1కి చేరింది. ఆగస్టులో ఇది 52.8గా నమోదైంది. పీఎంఐ పరిభాషలో ఇండెక్స్‌ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.

దేశీయంగా వినియోగానికి, ఎగుమతులకు డిమాండ్‌ పటిష్టంగా ఉండటం తయారీ రంగానికి బూస్ట్‌గా పని చేసింది. వ్యాపారాలపై ఆశాభావం నాలుగు నెలల గరిష్టానికి ఎగిసింది. ఆర్డర్లు, ఉత్పత్తి పెరగడంతో ఫ్యాక్టరీల్లో నియామకాలు కూడా జోరందుకున్నాయని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్‌ ఇండియా ఎకానమిస్ట్‌ ప్రాంజల్‌ భండారీ తెలిపారు.

ముడి వస్తువులు, విక్రయాల రేట్లు గణనీయంగా పెరిగినప్పటికీ గత చరిత్రతో పోలిస్తే ధరల పెరుగుదల నామమాత్రంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలతో కంపెనీలు ముడి వస్తువులను గణనీయంగా కొనుక్కుని, నిల్వలు పెంచుకున్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెక్స్‌టైల్స్‌ మొదలైన వాటికి నెలకొన్న డిమాండ్‌తో మొత్తం అమ్మకాలు ఫిబ్రవరి తర్వాత అత్యధిక స్థాయిలో భారీగా వృద్ధి నమోదు చేశాయి. బ్రెజిల్, యూరప్, యూఏఈ, అమెరికాలోని క్లయింట్ల నుంచి ఎగుమతుల ఆర్డర్లు కూడా పెరిగాయి.

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)