Breaking News

‘ఎన్‌పీఎస్‌ తత్కాల్’ పెన్షన్ ధమాకా.. క్షణాల్లో రిటైర్మెంట్ ప్లానింగ్!

Published on Fri, 10/02/2026 - 14:35

దేశంలో అసంఘటిత రంగ కార్మికులు, యువత, టైర్‌ 2, టైర్‌ 3 నగరాల ప్రజలకు సామాజిక భద్రతను మరింత చేరువ చేసే దిశగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత వేగవంతమైన ‘ఎన్‌‌పీఎస్ తత్కాల్’ విధానం ద్వారా రాబోయే రెండేళ్లలో దాదాపు 2-3 కోట్ల మంది కొత్త చందాదారులను జాతీయ పెన్షన్ విధానంలో (ఎన్‌పీఎస్‌) చేర్పించాలని పీఎఫ్‌ఆర్‌డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌పీఎస్ దివాస్ సందర్భంగా రెగ్యులేటరీ ఛైర్‌పర్సన్ ఎస్.రామన్ ఈ వివరాలను వెల్లడించారు.

ఏంటీ ‘ఎన్‌పీఎస్ తత్కాల్’? ఎలా పనిచేస్తుంది?

ఇప్పటివరకు కొత్త పెన్షన్ ఖాతా తెరిచి ‘ప్రాన్’ (Permanent Retirement Account Number) పొందడానికి పేపర్ వర్క్ లేదా సుదీర్ఘ ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. ఈ భారాన్ని తగ్గించేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు చెందిన బీహెచ్‌ఐఎం యూపీఐ యాప్‌ ద్వారా తక్షణ నమోదు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

మూడు సులువైన దశల్లో ఖాతా నమోదు

  • భీమ్ (BHIM) యాప్‌లోని రీఛార్జ్ అండ్‌ బిల్ పేమెంట్స్ విభాగంలో 'NPS' ట్యాబ్‌ను ఎంచుకోవాలి.

  • పుట్టిన తేదీ వంటి ప్రాథమిక వివరాలు ఇచ్చి కేవైసీ  పూర్తయిన బ్యాంకు ఖాతాను అనుసంధానించాలి.

  • తొలి కనీస విరాళంగా రూ.250లను యూపీఐ ద్వారా చెల్లించగానే క్షణాల్లో ‘ప్రాన్‌’ జెనరేట్ అయి ఖాతా యాక్టివేట్ అవుతుంది.

ఎవరెవరికి లభ్యం?

ప్రస్తుత తొలి విడతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి ఫిజికల్‌ కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా డిజిటల్ కేవైసీ ద్వారా క్షణాల్లో ప్రక్రియ పూర్తవుతుంది.

ఆర్థిక భద్రతలో నూతన అధ్యాయం

సాంప్రదాయ పీఎఫ్‌ లేదా ఇతర నిలకడైన పెన్షన్ పథకాల పరిధిలో లేనివారికి విశ్రాంత జీవితంలో నిలకడైన రాబడి అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. మార్కెట్ ఆధారిత రాబడితో పాటు రిటైర్మెంట్ సమయంలో నిర్ణీత యాన్యుటీ పింఛను పొందే వెసులుబాటు ఉండటంతో ‘ఎన్‌పీఎస్ తత్కాల్’ భారతీయ పింఛను వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: పరుగెత్తిన పసిడి ధర!

#

Tags : 1

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)