Breaking News

జీఎస్‌టీ వసూళ్ల జోష్‌! 

Published on Fri, 10/02/2026 - 05:12

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు దుమ్మురేపాయి. పటిష్టమైన దేశీ వినియోగంతో పాటు దిగుమతుల ఆదాయం దన్నుతో సెపె్టంబర్‌లో రూ.2.03 లక్షల కోట్ల స్థూల జీఎస్‌టీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14.7 శాతం వృద్ధి నమోదైంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) లో జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది మూడోసారి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.43 లక్షల కోట్లు, జూలైలో రూ. 2.11 లక్షల కోట్ల చొప్పున లభించింది. కాగా, 2026–27 తొలి ఆరు నెలల్లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు 11.6 శాతం వృద్ధితో రూ. 12.46 లక్షల కోట్లు నమోదుకాగా, నికర జీఎస్‌టీ ఆదాయం 10.6 శాతం పెరిగి రూ. 10.66 లక్షల కోట్లకు చేరింది. ఇతర ముఖ్యాంశాలివీ... 

→ సెపె్టంబర్‌లో దేశీ ఆర్థిక కార్యకలాపాల నుంచి స్థూల జీఎస్‌టీ వసూళ్లు 10.1 శాతం వృద్ధి చెంది రూ. 1.38 లక్షల కోట్లను తాకాయి. దిగుమతుల నుంచి ఆదాయాలు 26 శాతం ఎగిసి రూ.65,525 కోట్లకు చేరాయి. 
→ ఇక జీఎస్‌టీ రిఫండ్లు 3 శాతం తగ్గుదలతో రూ.27,001 కోట్లుగా నమోదయ్యాయి. 
→ రిఫండ్లను సర్దుబాటు చేస్తే, నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.76 లక్షల కోట్లుగా నమోదైంది. 18.1 శాతం వృద్ధి చెందింది.  

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)