ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
కార్ల అమ్మకాలకు పండుగ కళ..!
Published on Fri, 10/02/2026 - 05:08
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభానికి ముందే దేశీయ ప్యాసింజర్ వాహన (పీవీ) రంగం బలమైన వృద్ధిని నమోదు చేసింది. కార్ల తయారీ సంస్థల నుంచి సెప్టెంబర్‌లో డీలర్లకు పీవీల డిస్పాచ్‌లు దాదాపు 21 శాతం పెరిగి 4.60 లక్షల యూనిట్లకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఇదే నెలలో పరిశ్రమ మొత్తం డిస్పాచ్‌లు 3.78 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలన్నీ సెప్టెంబర్‌లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న పండుగల సీజన్ నేపథ్యంలో కార్ల కంపెనీలు డీలర్లకు సరఫరాలను పెంచడం, మార్కెట్లో డిమాండ్ నిలకడగా ఉండటం వృద్ధికి దోహదం చేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో జీఎస్‌టీ 2.0 అమలుకు ముందు దాదాపు 22 రోజుల పాటు అమ్మకాలు ప్రభావితమవడంతో ఏర్పడిన తక్కువ బేస్ కూడా ఈసారి వృద్ధి గణాంకాలకు కలిసొచ్చింది.
‘‘ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో నవరాత్రులతో ప్రారంభమై నవంబర్ రెండో వారంలోని దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్‌లో వాహనాలకు డిమాండ్ బలంగా ఉంటుంది’’ అని ఆటో పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, గతేడాది సెప్టెంబర్ 22న కొత్త జీఎస్‌టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత పండుగల సీజన్‌లో ఒకేసారి డిమాండ్ (పెంట్–అప్ డిమాండ్) వచ్చినందున, ఆ బేస్‌తో పోలిస్తే ఈసారి వృద్ధి రేటు కొంత మందగింవచ్చని భావిస్తాయి.
Tags : 1