Breaking News

ట్రైన్ టికెట్ ఉంటే సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే!

Published on Tue, 09/29/2026 - 16:59

అక్టోబర్ 1 నుంచి 31 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ తనిఖీలు కేవలం టికెట్ లేకుండా ప్రయాణించే వారికే మాత్రమే పరిమితం కావు. రాయితీ టికెట్లు, ప్రత్యేక రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాసులు, గ్రూప్ బుకింగ్స్‌పైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రైల్వే స్టేషన్లతో పాటు.. లోకల్ రైళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తారు.

రాయితీ లేదా ప్రత్యేక కోటాలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ అర్హతను నిరూపించేందుకు తప్పకుండా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ వెంట తీసుకెళ్లాలి. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫొటో ఐడీ, గుర్తింపు పొందిన విద్యాసంస్థ ఇచ్చిన విద్యార్థి ఐడీ వంటి పత్రాలను ఉపయోగించవచ్చు. ఫోన్‌లో ఉన్న ఐడీ ఫొటో లేదా జిరాక్స్ కాపీ కంటే ఒరిజినల్ డాక్యుమెంట్ వెంట ఉంచుకోవడం మంచిది.

ఒకే టికెట్‌పై పలువురు ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. గ్రూప్ బుకింగ్‌లో టికెట్‌లో పేరు ఉన్న ప్రయాణికుల్లో కనీసం ఒకరు అవసరమైన ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపించాలి. అలాగే ఈ-పాస్ లేదా ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (PTO)తో ప్రయాణించే వారు కూడా ఒరిజినల్ ఐడీని వెంట ఉంచుకోవడంతో పాటు, ప్రయాణానికి ముందు వాటిని నిర్దేశించిన 'అథారిటీ టు ట్రావెల్'గా మార్చుకున్నారో లేదో చూసుకోవాలి.

టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికుల వద్ద ఉన్న టికెట్లు నిజమైనవేనా, వారు ఉపయోగిస్తున్న రాయితీ లేదా కోటాకు అర్హులేనా అనే విషయాలను అధికారులు పరిశీలిస్తారు. అన్‌రిజర్వుడ్ టికెట్లను కూడా తనిఖీ చేస్తారు. అవసరమైనప్పుడు టికెట్ నిజమైనదా కాదా తెలుసుకోవడానికి టికెట్ చెకింగ్ సిబ్బంది టీటీఈ యాప్‌ను కూడా ఉపయోగించనున్నారు. సరైన టికెట్ లేదా అవసరమైన పత్రాలు లేకపోతే రైల్వే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. 1.58 కోట్ల కార్డులు రద్దు?

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు