Breaking News

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్.. రూట్‌ వివరాలు..

Published on Tue, 09/29/2026 - 08:57

దేశీయ రైల్వే రవాణా వ్యవస్థను ఆధునీకరించడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా భారతీయ రైల్వే శాఖ రూ.345 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నూతన ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించింది.

ఆంధ్రప్రదేశ్‌కు నూతన వీక్లీ ఎక్స్‌ప్రెస్

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ దక్షిణ తీర రైల్వే (సౌత్‌ కోస్ట్‌ రైల్వే) పరిధిలో మచిలీపట్నం - కర్నూలు సిటీ మధ్య కొత్త ట్రై-వీక్లీ (వారానికి మూడు రోజులు) ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్‌కు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది.

499 కిలోమీటర్ల మేర సాగే ఈ రైలు విజయవాడ మీదుగా నడుస్తుంది. మచిలీపట్నంలో సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం 04:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:45 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీలో మంగళ, గురు, ఆదివారాల్లో ఉదయం 09:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 21:35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల తదితర ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది.

యూపీలో కవచ్ 4.0

సరుకు రవాణాలో కీలకమైన ఒడిశాలోని బార్బిల్-బోలానిఖదాన్ 6 కిలోమీటర్ల సింగిల్ లైన్ సెక్షన్‌ను రూ.122 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ (రెండో ట్రాక్) చేయడానికి ఆమోదం తెలిపారు. ఇది ఇనుప ఖనిజం, పెల్లెట్ల రవాణా సామర్థ్యాన్ని ఏటా మరో 8.9 మిలియన్ టన్నులకు పెంచుతుంది.

మరోవైపు రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన స్వదేశీ పరిజ్ఞానం ‘కవచ్ 4.0’ విస్తరణకు పెద్దపీట వేశారు. ఉత్తర ఈశాన్య రైల్వే పరిధిలోని వారణాసి డివిజన్‌కు చెందిన 614.75 రూట్ కిలోమీటర్లలో రూ.223 కోట్ల అంచనా వ్యయంతో ఈ సురక్షిత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు సరుకు రవాణా వేగవంతమై దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు లభించనుంది.

ఇదీ చదవండి:  అలర్ట్‌.. అక్టోబరు 1 నుంచి నిబంధనలు మార్పు

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు