Breaking News

పండగ కళ

Published on Mon, 09/14/2026 - 01:15

గణేశుడి రూపానికి, కార్టూన్లకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే కార్టూనిస్టులకు అత్యంత ఇష్టమైన, సులభంగా విభిన్న రూపాల్లోకి మలచగలిగే రూపం గణపతి. ప్రముఖ కార్టూనిస్టులు సరసి, లేపాక్షి వినాయక చవితితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జ్ఞాపకాలతోపాటు జయదేవ్, రాజు  వంటి ఉద్దండుల కార్టూన్లు మచ్చుకు కొన్ని... గణపతి విశేషాలు మరికొన్ని...

1970ప్రాంతాలకు ముందు... ఆ తర్వాత అనుకుంటే బుక్‌స్టాల్‌ ముందు నుంచుంటే ఎన్నో మ్యాగజైన్లు కళ్ళముందు కళకళలాడుతూ కనపడేవి కొనండి కొనండంటూ. పండగలంటూ వచ్చాయంటే పాఠకులకు పండగే. కార్టూనిస్టులైతే నెల ముందు నుంచే బిజీ అయిపోయే వాళ్ళు. ముఖ్యంగా  వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు కార్టూనిస్టులకు ఇష్టమైన పండుగలు. అందులో వినాయక చవితి ప్రత్యేకం. 

గణపతి మీద ఎన్నో కార్టూన్లు గీసే వాళ్ళు. ఆ రోజుల్లో బాపు, జయదేవ్, మల్లిక్, సత్యమూర్తి, కాటూరి, రాగతి పండరి లాంటి ఎంతోమంది ప్రముఖ కార్టూనిస్టులు విరివిగా కార్టూన్లు వేసే వాళ్ళు. ప్రత్యేక సంచికంటే కార్టూన్లకు ఎక్కువప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళు. ఎక్కువ కార్టూన్లు ప్రింటవుతాయన్న ఉద్దేశంతో యువ కార్టూనిస్టులతో సహా అందరు కార్టూనిస్టులు ప్రయత్నించేవాళ్లు. అప్పుడు కార్టూన్లకు మంచి పారితోషికాలు కూడా ఇచ్చేవాళ్ళు. 

గణపతి మీద కార్టూన్లు అంటే ఎక్కువగా ఉండ్రాళ్ళు, చవితి–చంద్రుడు, గణపతి భూలోకం రావటం, మూషికం... ఇలాంటి సబ్జెక్టుల మీద కార్టూన్‌ ఎక్కువగా వేసేవాళ్ళు. అప్పుడు కార్టూనిష్టులు ఎక్కువగా ఉండేవాళ్లు, చదివేవాళ్ళు కూడా ఎక్కువమంది ఉండేవాళ్ళు కాబట్టి కార్టూనిష్టులు కూడా  చాలా శ్రద్ధగా కార్టూన్లు వేసేవారు. ఇప్పుడు పత్రికలు కూడా ఎక్కువ లేవు, శ్రద్ధగా వేసే కార్టూనిష్టులు కూడా తగ్గిపోయారు. ఏమైనా, ఆ రోజులు తల్చుకుంటే భలే ఆనందంగా ఉంటుంది నాలాంటి కార్టూనిస్టులకు.
– లేపాక్షి, సీనియర్‌ కార్టూనిస్ట్‌

నవ్వుల దేవుడు
వినాయక చవితి పిల్లలకే కాదు కార్టూనిస్టులకి కూడా పండగే. వినాయకుడు కార్టూనిస్టులకి దేవుడు, స్నేహితుడు, గొప్ప సబ్జెక్టు కూడా. అందుకే ఆయన  కార్టూనిస్టుల కులదైవం! ఆయన నవ్వించినట్టు ఏ దేవుడూ నవ్వించలేదు మరి. ఆయన్ని చూసే కార్టూనిస్టులు ప్రపంచాన్ని నవ్వించడం నేర్చుకున్నారేమో! 

దిన, వార, మాస పత్రికలు విస్తారంగా వచ్చే రోజుల్లో చవితి వచ్చిందంటే చాలు కార్టూనిస్టులు చెలరేగిపోయి కార్టూన్లు వేసేవారు. పండగ ప్రత్యేక సంచికలకి ‘ఫుల్‌ పేజి కార్టూన్లు’ వేసి ఆరారా నవ్వులు ఆరబోసేవారు. చవితి కార్టూన్లకి అన్ని ఐడియాలు ఎలా పుడతాయి కార్టూనిస్టులకి... అనిపిస్తుంది. పుడతాయి! ఒకటీ రెండూ కాదు ఎన్నయినా పుడతాయి. అదే మరి గణేశుడి మహిమ. 

పిల్లలు మట్టిలో ఆడితే కోప్పడే పెద్దలు తాము కూడా మట్టిలో చేతులు పెడతారు దేవుడి బొమ్మ చెయ్యడానికి. ఇది విచిత్రం కాదూ. బొమ్మ చేశాక అది  కార్టూనిస్టులు వేసే బొమ్మలాగా పొట్టిగా ఉన్నా,  పొట్ట పెద్దదైనా, చేతులు పీలగా ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్నా ఎలా వున్నా  అది గణేశుడి బొమ్మే! అలా ఎందుకు చేసావని  ఆ దేవుడు చిన్నబుచ్చుకోడు. నవ్వుతాడు. నవ్వుల దేవుడు కదా! ఇదే కాదు. 

అంత దేవుడూ కూడా తాను కూర్చుని సవారీ చేసేది చిన్న ఎలక మీద. ఇదో విచిత్రం! ఆ బొమ్మ పక్కనే చిన్న మట్టి ఎలక పిల్లని కూడా చేసి పెట్టాలి. లేకపోతే చిన్న ఎలక కాస్తా చిన్నబుచ్చుకుంటుంది. మట్టి ఉండలు చేసి ముగ్గులోనో, బియ్యం పిండిలోనో పొర్లించి వాటినే ‘ఉండ్రాళ్ళు’ అంటాం. రంగు రంగు బట్టలు కట్టి, గొడుగు నెత్తిన పెట్టి, పీటమీద కూర్చోబెడతాం. తరవాత పూజ. 

ఎక్కడెక్కడో పేర్లు కూడా వినని చెట్ల ఆకులతో పూజ. పిల్లా పెద్దా కుటుంబం అంతా కూర్చుని భక్తితో చేస్తాం ఆ పూజ. ఇదంతా ఓ విచిత్రం, వినోదం కాదూ. ఈ తతంగంలో ఎక్కడికక్కడ ఐడియాలు వెల్లివిరుస్తాయి కార్టూనిస్టులకి. అందుకే వినాయకచవితి కార్టూనిస్టులకి ఓ నవ్వులగని. తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత. నవ్వుకునేవాడికి నవ్వుకున్నంత!!


నవ్వించేవాడి చుట్టూ  నలుగురూ చేరతారు. అలా  నవ్వించే దేవుడే గణేశుడు. ఆ దేవుడి చుట్టూ తిరుగుతూ ‘గణపతి బప్పా మోరియా’ అంటూ మనం ఆనందంతో గెంతులు వేసే ఈ నవ్వుల పండగ ఏడాది పొడుగునా ఉంటే ఎంత బావుంటుంది కదా!  
– సరసి, సీనియర్‌ కార్టూనిస్ట్‌
 

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)