Breaking News

ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Published on Fri, 09/11/2026 - 08:24

టైటిల్: ఎపిక్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి తదితరులు
దర్శకత్వం: ఆదిత్య హాసన్
సంగీతం: హేషమ్ వాహబ్
సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్
నిర్మాత: నాగవంశీ
విడుదల తేదీ: 2026 సెప్టెంబరు 11

‘బేబీ’తర్వాత ఇటు వైష్ణవి చైతన్య, అటు ఆనంద్ దేవరకొండ ఇద్దరూ బీజీ అయిపోయారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే బేబీ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయితే అందుకోలేకపోయారు. ఈ సారి ఎలాగైన హిట్‌ కొట్టాలనే కసితో ఇద్దరు కలిసి జంటగా ‘ఎపిక్‌’ మూవీలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాలతో నేడు(సెప్టెంబర్‌ 11 ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే?
ఓటీటీలో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘#90స్’వెబ్‌ సిరీస్ లోని తమ్ముడు పాత్ర జీవితానికి సంబంధించిన కథ ఇది. ఆదిత్య(ఆనంద్‌ దేవరకొండ) పెద్దయ్యాక సినిమా డైరెక్టర్‌ అవ్వాలనుకుంటాడు. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం పైచదువుల కోసం లండన్‌ వెళ్లాలని ఒత్తిడి చేస్తారు. ప్లాన్‌ బిలో భాగంగా ఆదిత్య లండన్‌ వెళ్తాడు. అక్కడ కాలేజీలో తెలుగమ్మాయి కడలి(వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. తొలి రోజే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ప్రేమ, పెళ్లి వద్దనుకొని సహజీవనం ప్రారంభిస్తారు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు ఉన్న వీరి సహజీవనం ఎలా కొనసాగింది? పెళ్లి వద్దనుకొని లండన్‌ వచ్చిన కడలి.. ఆదిత్యతో బంధాన్ని ఎలా సాగించింది? వీరి బంధం సహజీవనానికే పరిమితం అయిందా లేదా ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిందా? ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడే ఆదిత్య.. ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ఎలా ఉందంటే..?
కొన్ని సినిమా కథలు చాలా సింపుల్‌గా ఉంటాయి కానీ తెరపై చూస్తుంటే మాత్రం ఎంటర్‌టైన్‌ అవుతాం. ఎపిక్‌ కూడా అలాంటి సినిమానే. ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది ఈ సినిమా కథ. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ పాయింట్‌ యూత్‌తో యూత్‌ని ఆకట్టుకునేలా సినిమా తీయొచ్చు. ఆదిత్య హాసన్‌ అదే చేశాడు. యువతరానికి నచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అవి వర్కౌట్‌ అయ్యాయి కానీ మిగతా చోట్ల చాలా వరకు రొటీన్‌గా, లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. కడలి పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా సరిగా లేదు. మొదట్లో ఆ పాత్రను చాలా  మెచ్యూర్డ్‌గా పరిచయం చేసి ఆ తర్వాత సాధారణ అమ్మాయిలాగే చూపించారు. ఆమె నేపథ్యం ఒకలా.. లండన్‌లో ఆమె ప్రవర్తించే తీరు మరోలా ఉంటుంది. ఆదిత్య, కడలి మధ్య ఉన్న బంధం ప్రేమేనా లేదా ఇంకా వేరేదా అనేది క్లారిటీ ఉండదు. పరిచయం అయిన తొలి రోజే కడలి మెచ్యూర్డ్‌ అమ్మాయి..ఆదిత్య రూమ్‌కి వెళ్లడం..ముద్దులు పెట్టుకోవడం..ఆ తర్వాత వెంటనే హద్దులు దాటడం అనేది కన్విన్సింగ్‌గా అనిపించదు. అయితే ఆయా సన్నివేశాలు మాత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. అలా అని దర్శకుడు తెరపై రొమాన్స్‌ మాత్రమే చూపించలేదు. సింపుల్‌ కథే అయినా అందులో చాలా మంచి విషయాలు చర్చించాడు కూడా. ప్రస్తుతం సమాజంలో ఉన్న కులాల పట్టింపు, అమ్మాయిల ఎదుర్కొనే శారీరక సమస్యలు..లాంటి అంశాలను పైపైన చూపిస్తూనే ఆలోచింపజేశాడు.

ఫస్టాఫ్‌ మొత్తం ఫుల్‌ రొమాంటిక్‌గా, యూత్‌ని ఆకట్టుకునే సన్నివేశాలతో కొనసాగతుంది. ఆదిత్య, కడలి పరిచయం అవ్వడం.. సహజీవనం కొనసాగించడం.. మధ్య మధ్యలో మిడిల్‌ క్లాస్‌ కష్టాలను చూపిస్తూ ప్రథమార్థం ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇక సెకండాఫ్‌ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ఇద్దరి సహజీవనం కాస్త ప్రేమగా మారడం..ఆదిత్య గందరగోళానికి లోనై స్నేహితుడితో మాట్లాడడం.. అతను చెప్పినట్లుగా ఫాలో అవ్వడం ఇలా కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతుంది. దీంతో సెకండాఫ్‌ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ముగింపు కూడా గొప్పగా ఉండదు.

ఎవరెలా చేశారు?
ఇక నటన విషయానికి వస్తే ఆనంద్, వైష్ణవి అనగానే 'బేబి' సినిమా గుర్తొస్తుంది. ఆ ఇమేజ్ నుంచి బయటపడి కొత్తగా కనిపించారు. ఆనంద్ తన పాత్రలో సహజంగా అనిపించగా, వైష్ణవి మోడ్రన్ అమ్మాయి పాత్రలో కాన్ఫిడెంట్‌గా నటించింది. శివాజీ, వాసుకి తమ పాత్రలకు న్యాయం చేశారు. కళ్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి అక్కడక్కడా నవ్వించారు. సాంకేతిక అంశాలకొస్తే హేషమ్ అబ్దుల్ వాహబ్ నేపథ్య సంగీతం బాగుంది. అజీమ్ మహమ్మద్ కెమెరా పనితనం, యూకే లొకేషన్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయనని చెప్పొచ్చు.

-అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్

Videos

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

VIdeo: ఇలా కూడా బ్యాంక్ దోచేస్తారా?

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో

స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)