Breaking News

డాన్సర్స్‌ అసోసియేషన్‌ వివాదం.. రఘు మాస్టర్‌, సుమలతతో చర్చలు

Published on Wed, 09/09/2026 - 21:14

లేబర్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో డాన్సర్స్‌ అసోసియేషన్‌ వివాదంపై కీలక సమావేశం జరిగింది. జాయింట్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్‌, సుమలత దేవితో పాటు ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు జాయింట్‌ కమిషనర్‌ ఎదుట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

 తమకు అన్యాయం జరిగిందని..
సుమలత అధ్యక్షురాలిగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఆమె కార్యవర్గంలోని కొంతమంది రాజీనామా చేశారని జాయింట్‌ కమిషనర్‌ తెలిపారు. ఖాళీ అయిన స్థానాలకు సుమలత ఉప ఎన్నికలు నిర్వహించడంతో.. ఇప్పటికే ఎన్నికైన తమకు అన్యాయం జరిగిందని కొందరు ఆరోపించినట్లు చెప్పారు. తమవైపే మెజారిటీ సభ్యులు ఉన్నారని రఘు మాస్టర్‌ పేర్కొన్నారు.
ఫెడరేషన్‌ కీలక పాత్ర పోషిస్తుందని..
ఈ వివాదాన్ని 24 క్రాఫ్ట్స్‌ ఫెడరేషన్‌ సమక్షంలో పరిష్కరించుకోవాలని జాయింట్‌ కమిషనర్‌ సూచించారు. వివాదం కొనసాగితే యూనియన్‌ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫెడరేషన్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని డాన్సర్లు కోరుతున్నారని రఘు మాస్టర్‌ తెలిపారు. సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఫెడరేషన్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)