Breaking News

కైనెటిక్ కొత్త స్కూటర్.. 132 కిమీ రేంజ్!

Published on Tue, 09/08/2026 - 19:49

కైనెటిక్ తన ఐకానిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పెద్ద బ్యాటరీ.. అదనపు టెక్నాలజీతో (డీఎక్స్ ప్లస్) అప్‌గ్రేడ్ చేసింది. ఈ స్కూటర్ ఇప్పుడు 3.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 132 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

కొత్త డీఎక్స్ ప్లస్ స్కూటర్.. రేంజ్, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. ఇందులో K-కోస్ట్ టెక్ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ కూడా ఉంది. ఇది మెటల్ బాడీని కలిగి ఉండటంతో పాటు, రివర్స్‌తో కూడిన పార్క్ అసిస్ట్, ఈజీ ఛార్జ్, టెలిమాటిక్స్.. IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ వంటి ఆధునిక ఫీచర్లను పొందుతుంది.

కైనెటిక్ డీఎక్స్ ప్లస్ స్కూటర్ క్విక్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా 0-80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. ప్రాక్టికాలిటీకి ప్రధాన ప్రాధాన్యత లభిస్తుంది. ఇందులో సీటు కింద 37 లీటర్ల స్టోరేజ్, 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, రెండు వైపులా 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 220 మిమీ డిస్క్, వెనుక వైపు 130 మిమీ డ్రమ్ ఉన్నాయి.

కైనెటిక్ డీఎక్స్ 3 కిలోవాట్ ధర రూ. 1.19 లక్షలు కాగా.. డీఎక్స్ ప్లస్ 3.1 కిలోవాట్ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్). డీఎక్స్ ప్లస్ బ్లాక్, సిల్వర్, బ్లూ, వైట్, రెడ్ అనే ఐదు రంగులలో లభిస్తుండగా, డీఎక్స్ బ్లాక్, సిల్వర్ ఆప్షన్‌లను పొందుతుంది. కంపెనీ డీఎక్స్ ప్లస్ పై రూ. 3,000 ప్రయోజనంతో పాటు, రూ. 8,999 విలువైన పొడిగించిన వారంటీ కూడా అందిస్తుంది.

Videos

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)