Breaking News

యాపిల్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Published on Tue, 09/08/2026 - 14:50

యాపిల్ తన కొత్త ఐఫోన్ 18 సిరీస్‌ను.. సెప్టెంబర్ 9న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ అమెరికాలోని కుపర్టినోలో భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మాత్రమే కాకుండా.. కొత్త యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లను కూడా పరిచయం చేయనుంది.

ప్రీ-ఆర్డర్స్ ఎప్పుడంటే?
ఐఫోన్ 18 ప్రో కోసం ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా.. ఆపిల్ కొత్త ఐఫోన్‌లకు ఈవెంట్ తర్వాత వచ్చే శుక్రవారం ప్రీ-ఆర్డర్లు ప్రారంభిస్తుంది. అయితే.. ఈసారి తేదీలో కొంత మార్పు ఉండవచ్చని తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

iOS 27 విడుదల
కొత్త ఐఫోన్‌లతో పాటు iOS 27 కూడా రానుంది. ఇది సెప్టెంబర్ 14న విడుదలయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 18లో ఐఓఎస్ 27 ముందుగానే ఉంటుంది. అలాగే పాత ఐఫోన్‌లలో కూడా ఈ అప్‌డేట్ అందుబాటులోకి రావచ్చు. అప్‌డేట్ విడుదలైన వెంటనే చాలామంది డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి కొంత సమయం పట్టవచ్చు.

ఐఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?
ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్లు.. సెప్టెంబర్ 18న మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. యాపిల్ సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్‌లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్
ఈసారి యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది నిజంగా విడుదలైతే యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో చాలా పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ధరలు, బుకింగ్‌లకు సంబంధించిన సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)