Breaking News

నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్‌.. ధర ఎంతంటే..

Published on Tue, 09/08/2026 - 13:23

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ మహారాష్ట్రలోని ప్రముఖ హిల్‌ స్టేషన్‌ లోనావాలాలో సుమారు 3.86 ఎకరాల భూమిని దాదాపు రూ.70 కోట్లకు కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌ డేటాను విశ్లేషించిన జాప్‌కీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ లావాదేవీ మూడు కన్వేయన్స్‌ డీడ్‌ల ద్వారా సెప్టెంబర్‌ 4న నమోదైంది. మొత్తం విలువ రూ.69.99 కోట్లు. ఈ ఆస్తులను నందన్‌ ధనంజయ్‌ మెహతా, వివస్వత్‌ ధనంజయ్‌ మెహతాల నుంచి కొనుగోలు చేశారు.

పుణె జిల్లా లోనావాలాలోని హెచ్‌ వార్డులో నాలుగు సిటీ సర్వే నంబర్లలో మొత్తం 1.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. ఇందులో దాదాపు 3.09 ఎకరాలను పూర్తి యాజమాన్య హక్కుతో కొనుగోలు చేయగా, ఈ భూమిపై సుమారు 2,100 చదరపు అడుగుల నిర్మాణం కూడా ఉంది. అదనంగా, మరో రెండు స్థలాల్లో 50% వాటాను కూడా తెందుల్కర్‌ దక్కించుకున్నారు.

ఈ మూడు డీడ్‌ల విలువలు వరుసగా రూ.63.69 కోట్లు, రూ.4.56 కోట్లు, రూ.1.75 కోట్లుగా ఉన్నాయి. కొనుగోలుదారు స్టాంప్‌ డ్యూటీ కింద సుమారు రూ.4.20 కోట్లు చెల్లించారు. మొత్తం లావాదేవీ ఆధారంగా చదరపు అడుగుకు సగటున రూ.4,168 చొప్పున ధర లెక్కించబడింది. ముంబై, పుణె నగరాల సంపన్నుల సెకండ్‌ హోమ్‌ డెస్టినేషన్‌గా మారిన లోనావాలాలో ఇటీవలి కాలంలో ప్రముఖులు భారీగా ఆస్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలోని బాంద్రాలో అత్యంత ఖరీదైన బంగ్లా కలిగిన తెందుల్కర్‌, తాజా కొనుగోలుతో తన రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)