Breaking News

అపూర్వ భారతీయం

Published on Tue, 09/08/2026 - 00:38

శిల్పాలు, చిత్రాలు, ఇన్‌స్టాలేషన్‌... కళాకృతి ఏదైనా కావచ్చు. అందులో భారతి ఖేర్‌ ముద్ర కనిపిస్తుంది. ‘వస్తువులలో అంతర్లీనంగా దాగి ఉన్న కళను ఖేర్‌ వెలుగులోకి తెస్తారు’ అంటారు ఆర్ట్‌ క్రిటిక్స్‌. ఆ వస్తువులు పురాణాలతో ముడిపడి ఉండవచ్చు. చారిత్రక సంఘటనలతో ముడిపడి ఉండొచ్చు. తాజా విషయానికి వస్తే... ఫోర్బ్స్‌ ఇండియా ‘షోస్టాపర్స్‌ 2026: 100 బిగ్గెస్ట్‌ సెలబ్రిటీస్‌’ జాబితాలో భారతి ఖేర్‌ చోటు సాధించారు...

భారతి ఖేర్‌ కళాకృతులలో బొట్టు అనేది ప్రత్యేకంగా కనబడుతుంది. 1995లో మొదటిసారిగా అది ఆమె కళాకృతిలో కనిపించింది. ఇక అప్పటినుండి ఖేర్‌ సృజించిన కళాకృతులలో బొట్టు  ప్రత్యేక సౌందర్య చిహ్నంగా మారింది. ‘బొట్టు నాకు మూడవ కన్నులాంటిది. వాస్తవ ప్రపంచానికి, ఆధ్యాత్మిక, భావనాత్మక ప్రపంచాలకు మధ్య అది బంధాన్ని ఏర్పరుస్తుంది’ అని చెబుతుంటారు ఖేర్‌.

ఆ మ్యూజియం... ఆశాదీపం
ఖేర్‌ సృష్టించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 2006 శిల్పం ‘ది స్కిన్‌ స్పీక్స్‌ ఏ లాంగ్వేజ్‌ నాట్‌ ఆన్‌ ఇట్స్‌ ఓన్‌’లో బొట్టు ప్రత్యేకంగా కనిపిస్తుంది. సోథెబీస్‌ వేలంలో ఈ శిల్పం రికార్డ్‌ స్థాయిలో రూ.6.9 కోట్లకు అమ్ముడుపోయింది. ‘మ్యూజియమ్స్‌ జ్ఞాపకాల నిలయాలు. అవి మౌనప్రదేశాలు కాదు. సౌందర్యం, చరిత్ర, రాజకీయాల గురించి మాట్లాడతాయి. భారతదేశంలో ఎనిమిది వందల మ్యూజియమ్స్‌ ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకు సరిగ్గా పనిచేయడం లేదు. పట్నాలో బిహార్‌ మ్యూజియంలాంటి అద్భుతమైన మ్యూజియంలు ఉన్నాయి. అలాంటివి ఆశాదీపాన్ని వెలిగిస్తాయి’ అంటున్నారు ఖేర్‌.

 ప్రారంభం
ఖేర్‌ రూపొందించిన  కళాకృతులు న్యూయార్క్‌లోని పబ్లిక్‌ ఆర్డ్‌ ఫండ్, యార్క్‌షైర్‌ స్కల్ప ్చర్‌ పార్క్, కోపెన్‌హాగన్‌లోని థోర్వాల్డ్‌సెన్స్‌ మ్యూజియం, లండన్‌లోని హేవర్డ్‌ గ్యాలరీ, వి అండ్‌ ఏ, నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ కెనడా, గుగ్గెన్‌హీమ్‌ అబుదాబీలలో ప్రదర్శించబడ్డాయి.
‘కాదేది కళకు అనర్హం’ అన్నట్లుగా ఖేర్‌ ఏ వస్తువుతోనైనా కళాకృతులు సృష్టించగలరు. మూడు దశాబ్దాల సుదీర్ఘ కేరీర్‌లో అద్భుత కళారూపాలను ఆవిష్కరించారు. ‘నిన్ను నువ్వు తెలుసుకోవడమే సకల జ్ఞానానికి  ప్రారంభం’ అనే ప్రఖ్యాత తత్వవేత్త ఆరిస్టాటిల్‌ మాట ఆధారంగా రూపొందించిన కళారూపానికి మంచి స్పందన వచ్చింది.

ఎప్పుడూ చెప్పే విషయం
లండన్‌లోని న్యూ కాజిల్‌ పాలిటెక్నిక్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌లో ఫౌండేషన్‌ కోర్సులో చేరి, ఫైన్‌ ఆర్ట్, పెయింటింగ్‌లో బి.ఏ. చేసిన భారతి ఖేర్‌ 1993లో ఇండియాకు వచ్చారు.
‘సునామీ సమయంలో జంతువులు ఎత్తైన ప్రదేశాలకు పారిపోయాయని, పక్షులు మనుషులకు హెచ్చరికలు చేశాయని, కాని మనుషులు వాటిని వినలేకపోయారని లేదా పట్టించుకోలేదని అంటారు. మనుషులకు ఉన్న అహంకారం ఏమిటంటే తమకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ కళ మాత్రం మనకు ఏం తెలియదని ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది’ అంటారు భారతి ఖేర్‌.

కొత్త మార్గం
ఖేర్‌కు బాగా ఇష్టమైన పుస్తకం హనీఫ్‌ ఖురేషి రాసిన ది బుద్ధ ఆఫ్‌ సబర్బియా.
‘నేను యూకేలోని శివారు  ప్రాంతాల్లో పెరిగాను. ఈ పుస్తకానికి ముందు ఫిక్షనల్‌ పుస్తకాలేవీ చదవలేదు. జాతి వివక్ష, వర్గ విభేదాల గురించి వ్యంగ్యం, హాస్య ధోరణిలో చెప్పిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని నేను ఒక్కసారిగా చదివేశాను. ఇది నా జీవితమే. నా జీవితంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో కలిసి బ్యూటీఫుల్‌ లాండ్రెట్‌ అనే సినిమా చేశాను. అది నాకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది’ అంటారు భారతి ఖేర్‌.
 
ఆ అనుబంధమే... కళ!
మాటల్లో చెప్పడానికి కష్టమైదానిని నేను కళారూపంలోకి తీసుకురావాలనుకుంటాను. దానికి సరిపోయే ప్రత్యేకమైన వస్తువు కోసం వెదుకుతాను. మనసు లోతుల్లో నుంచి పుట్టే భావోద్వేగానికి లేదా చిత్రానికి అద్భుతమైన రూపం ఇవ్వాలంటే ఎంచుకునే వస్తువు కొత్తగా ఉండాలి. మనం కంటితో చూసేదానికి,  మనసుతో చూసేదానికి మధ్య అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధమే కళాకృతుల పుట్టుకకు కారణం అవుతుంది. కళ అనేది సిద్ధాంతాల సమ్మేళనం కాదు. పరిసరాలను కంటితో కాకుండా మనసుతో చూడడం. నా దృష్టిలో కళ అంటే కేవలం ఆలోచన మాత్రమే కాదు. ఒక వస్తువును అందమైన స్థితిలోకి తీసుకురావడం కూడా. ఒక కళాకృతి రూపుదిద్దుకునే క్రమంలో మ్యాజిక్‌ (అద్భుతం) జరుగుతుంది. ఆల్కెమీ(రూపాంతర ప్రక్రియ) జరుగుతుంది.
– భారతి ఖేర్‌

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)