సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు
Breaking News
తిరిగొచ్చిన ఆక్టేవియా ఆర్ఎస్.. రూ.6 లక్షలు పెరిగిన ధర!
Published on Sun, 09/06/2026 - 08:43
స్కోడా తన ఆక్టేవియా ఆర్ఎస్ కారును మరోమారు.. భారతదేశంలో అమ్మకానికి పెట్టింది. అయితే ఈసారి దీని ధర రూ.56.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రారంభంలో దీని ధర రూ.49.99 లక్షల వద్ద ఉండేది. ఇప్పుడు రెండో బ్యాచ్ రేటు రూ.6.70 లక్షలు ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్కోడా మొదటి విడతలో 100 యూనిట్ల ఆక్టేవియాలను మాత్రమే పరిమితం చేసింది. గత సంవత్సరం ఈ కారు భారతదేశంలోకి అడుగుపెట్టక ముందే అమ్ముడైపోయింది. ఇప్పుడు కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఈ బ్యాచ్ మరింత పరిమితమైంది. వచ్చే వారం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ఆక్టేవియా ఆర్ఎస్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది. వోక్స్వ్యాగన్ తన గోల్ఫ్ జీటీఐలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తోంది. అయితే ఆక్టేవియా RS దాని ఇండియా-స్పెక్ కాన్ఫిగరేషన్‌లో 265 bhp మరియు 370 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ శక్తిని కేవలం ముందు చక్రాలకు మాత్రమే పంపుతుంది. ఈ సెడాన్ 6.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, అలాగే గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని స్కోడా పేర్కొంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ 13-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 11-స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారులో మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్లైట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మసాజ్ ఫంక్షన్లతో కూడిన హీటెడ్ అండ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంది.
Tags : 1