DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
Breaking News
ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించిన స్పెషల్ బైక్
Published on Sat, 09/05/2026 - 15:05
క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న.. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్, ఇటీవల లాంచ్ చేసిన జావా 42 ఎఫ్‌జె ఆల్ స్టార్స్ తర్వాత తమ కొత్త శ్రేణిని విస్తరిస్తూ.. 'జావా ఆల్ స్టార్స్ 42 బాబర్'ను ఆవిష్కరించింది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, గ్లోబల్ చెస్ లీగ్ 2026లో ఈ బైకును ఆవిష్కరించారు. దీని ధరలు రూ. 2.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
జావా ఆల్ స్టార్స్ 42 బాబర్.. స్టాండర్డ్ జావా 42 బాబర్‌పైనే ఆధారపడి ఉంటుంది. కానీ కొత్త పెయింట్ ఎంపికలు, చదరంగం గళ్ల గ్రాఫిక్స్, ఆల్ స్టార్స్ చిహ్నాన్ని పొందుతుంది. ఇది బ్లాక్ మిర్రర్, షాడో బ్లాక్, సిల్వర్ నైట్, జాస్పర్ రెడ్, మిస్టిక్ కాపర్ అనే ఆరు రంగులలో లభిస్తుంది.
వేరియంట్ వారీ ధరలు
➤ఆల్ స్టార్స్ మిస్టిక్ కాపర్: రూ. 2,08,942
➤ఆల్ స్టార్స్ జాస్పర్ రెడ్: రూ. 2,15,942
➤ఆల్ స్టార్స్ సిల్వర్ నైట్: రూ. 2,15,942
➤ఆల్ స్టార్స్ షాడో బ్లాక్: రూ. 2,17,942
➤ఆల్ స్టార్స్ బ్లాక్ మిర్రర్: రూ. 2,19,942
ఈ స్పెషల్ ఎడిషన్.. స్టాండర్డ్ 42 బాబర్‌లోని 334 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తోనే కొనసాగుతుంది. ఇది 7,500 rpm వద్ద 29 హార్స్ పవర్, 5,500 rpm వద్ద 30.01 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ జత చేయబడి ఉంటాయి.
ఈ మోటార్‌సైకిల్‌లో డబుల్-క్రాడిల్ ఫ్రేమ్, 35 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, 7 టైప్స్ ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన గ్యాస్-ఛార్జ్డ్ రియర్ మోనోషాక్‌ను వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందువైపు 280 మిమీ డిస్క్, వెనుకవైపు 240 మిమీ డిస్క్‌తో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు.
Strike Two: Jawa All Stars 42 Bobber.
The mark has found its next icon. Mr. Anand Mahindra unveiled India’s Most Loved Bobber at Global Chess League in its All Stars expression.
Unmistakable silhouette.
Unmistakable character.
Presenting the Jawa All Stars 42 Bobber.… pic.twitter.com/ExeRaWXWBp— Jawa Motorcycles (@jawamotorcycles) September 4, 2026
Tags : 1