DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
Breaking News
నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా
Published on Sat, 09/05/2026 - 09:02
సినిమాలో హీరో లేదా హీరోయిన్ చేసే సీన్స్ చూసి మనం నిజంగా ఫీలైతే సదరు నటుడు సక్సెస్ అయినట్లే. 'బేబి' రిలీజ్ టైంలో ఇలానే జరిగింది. మూవీలోని బెడ్ రూం సన్నివేశాలు చూసి హీరోయిన్ వైష్ణవి చైతన్యపై చాలామంది ట్రోల్ చేశారు. అయితే ఈమెతో గతంలో జరిగిన ఓ షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టిన 'ఇరుముడి' దర్శకుడు శివ నిర్వాణ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైష్ణవి చేసిన 'ఎపిక్' చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా మాట్లాడాడు.
(ఇదీ చదవండి: 'డిసి' సూపర్ హిట్.. బ్యూటీకి బంపర్ ఆఫర్)
'నా 'టక్ జగదీష్' సినిమాలోని ఓ సీన్లో రౌడీ వచ్చి వైషు నడుము గిల్లాలి. కానీ తను వద్దని చెప్పింది. ఇబ్బందిగా ఫీలవుతున్నానని చెప్పింది. అప్పుడు దగ్గరకెళ్లి చెప్పా. ఇది పాత్ర, నువ్వు కాదని ఆమెతో అన్నాను. కట్ చేస్తే 'బేబి' చూసి షాకయ్యా. అప్పుడు నాకొకటి అనిపించింది. ఏంటి పాత్రలా ఫీలవ్వమంటే ఈ లెవల్లో జీవించేసిందా అని అనుకున్నాను' అని శివ నిర్వాణ.. వైష్ణవి చైతన్యతో గతంలో జరిగిన అనుభవం గురించి బయటపెట్టాడు.
షార్ట్ ఫిల్మ్స్‌తో నటిగా మారిన వైష్ణవి చైతన్య.. అల వైకుంఠపురములో, టక్ జగదీష్, వరుడు కావలెను తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఎప్పుడైతే 'బేబి'తో హిట్ అందుకుందో అప్పటినుంచి హీరోయిన్గా అవకాశాలు వస్తున్నాయి. అలా ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఈమె చేసిన 'ఎపిక్' మూవీ వచ్చే శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ)
#TuckJagadish లో...
రౌడీ వచ్చి నడుము గిల్లే సీన్...
UNCOMFORTABLE అని చెప్పింది..
CUT చేస్తే BABY చూసి SHOCK అయ్యా!#ShivaNirvana | #VaishnaviChaitanya pic.twitter.com/KY0cE5isHR— Movies4u Official (@Movies4u_Officl) September 4, 2026
Tags : 1