Breaking News

డిజిటల్ వ్యాపారులకు ఆర్‌బీఐ నిబంధనల తలనొప్పి!

Published on Fri, 09/04/2026 - 09:57

చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకొచ్చిన రీ-కేవైసీ నిబంధనలు ఇప్పుడు దేశీయ ఫిన్‌టెక్ రంగానికి కొత్త తలనొప్పిగా మారినట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేమెంట్ అగ్రిగేటర్లు తమ వద్ద నమోదైన పాత వ్యాపారుల (మర్చంట్ల) అందరి కేవైసీని పూర్తి చేయడానికి ఆర్‌బీఐ విధించిన సెప్టెంబరు 15 గడువు సమీపిస్తుండటంతో ఫిన్‌టెక్ సంస్థల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

ఈ గడువులోగా వివరాలు నవీకరించకపోతే లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. చిన్న స్థాయి క్యూఆర్ కోడ్ వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది, ఆన్‌లైన్‌లో సేవలు అందించే సుమారు 10 లక్షల మంది మైక్రో వ్యాపారులు ఈ గడువును మిస్ అయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది ఆర్‌బీఐ జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్స్ ప్రకారం ఆన్‌లైన్, ఫిజికల్ (ఆఫ్‌లైన్), క్రాస్-బోర్డర్ పేమెంట్ అగ్రిగేటర్లు తమ వ్యాపారుల వివరాలను సమగ్రంగా పునపరిశీలించాలి. అయితే వీధి వ్యాపారులు, చిన్న కిరాణా కొట్టు నిర్వాహకుల వద్ద అధికారిక వ్యాపార ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది.

మరోవైపు, కేవైసీ ప్రక్రియ కోసం థర్డ్-పార్టీ ఏజెన్సీలను కాకుండా తమ సొంత సిబ్బందిని మాత్రమే వినియోగించాలని ఆర్‌బీఐ ఆదేశించడంతో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి సంస్థలపై నిర్వహణ భారం పెరిగింది. లక్షలాది మంది వ్యాపారుల వద్దకు క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి భౌతిక పరిశీలన చేయడం ఆకాశానికి నిచ్చెన వేయడమేనని పేమెంట్ సంస్థల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సౌండ్‌బాక్స్ వినియోగించే మర్చంట్లలో 85-90% వరకు ప్రక్రియ పూర్తవుతున్నప్పటికీ చిన్న క్యూఆర్ వ్యాపారుల(మైక్రో) కేవైసీ మాత్రం మందకొడిగా సాగుతోంది. ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉండటం ముఖ్యమే అయినప్పటికీ క్షేత్రస్థాయి సమస్యలను, ఆటంకాలను పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ ఈ గడువును కొంతకాలం పొడిగించాలని లేదా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిజిటల్ చెల్లింపుల వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్‌లెస్ రోబోటాక్సీ!

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)