Breaking News

మొబైల్ నంబర్ వెనుక ఇంత కథ ఉందా?

Published on Thu, 09/03/2026 - 19:57

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేనివారి దాదాపు ఉండరు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మన రోజువారి జీవితంలో మొబైల్ నంబర్ చాలా ముఖ్యమైనది. ఎవరి ఫోన్ నెంబర్ అడిగినా వెంటనే 10 అంకెలే చెబుతారు. అయితే.. మన మొబైల్ నంబరులో 10 అంకెలే ఎందుకు ఉన్నాయి?, అందులో కూడా ఎక్కువగా 9, 8, 7, 6తోనే ఎందుకు మొదలవుతాయి? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

10 అంకెలే ఎందుకు?
భారత్‌లో టెలికాం నెంబర్ల కేటాయింపును డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా నెంబర్లను సరిగ్గా కేటాయించేందుకు నేషనల్ నంబరింగ్ ప్లాన్ (NNP) ఉంది. 2003లో రూపొందించిన ఈ ప్లాన్‌లో మొబైల్ సేవలకు 10 అంకెల నంబరింగ్ విధానాన్ని కొనసాగించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. దేశంలో మొబైల్ వాడకం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని ముందే అంచనా వేసి, ఎక్కువ మందికి ప్రత్యేకమైన నంబర్లను ఇవ్వడానికి 10 అంకెల విధానాన్ని ఉపయోగించారు.

9, 8, 7, 6తోనే ఎందుకు..
మొదట్లో మొబైల్ నంబర్ల కోసం 9 సిరీస్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. కాలక్రమేణా మొబైల్ కనెక్షన్లు భారీగా పెరగడంతో 9 సిరీస్‌లో అందుబాటులో ఉన్న నంబర్లు తగ్గిపోయాయి. దీంతో కొత్త నంబర్ల కోసం 8, ఆ తర్వాత 7, 6 సిరీస్‌లను కూడా మొబైల్ సేవలకు కేటాయించారు. ఇక 0, 1 వంటి అంకెలను ప్రత్యేక సేవలు, షార్ట్ కోడ్లు, ఇతర టెలికాం అవసరాలకు ఉపయోగిస్తారు. అందుకే మనం సాధారణంగా 6, 7, 8, 9తో మొదలయ్యే మొబైల్ నంబర్లను ఎక్కువగా చూస్తుంటాం.

10 అంకెలతో ఎన్ని నంబర్లు వస్తాయి?
10 అంకెలు ఉన్నాయంటే భారీ సంఖ్యలో నంబర్ల కలయికలను తయారు చేయవచ్చు. అయితే.. అందులో ప్రతి కలయికను మొబైల్ నంబర్‌గా ఉపయోగించరు. కొన్ని నంబరింగ్ సిరీస్‌లను ఫిక్స్‌డ్ లైన్లు, ప్రభుత్వ సేవలు, ప్రత్యేక సేవలు, ఇతర టెలికాం అవసరాల కోసం కేటాయిస్తారు. మొదట్లో 9 సిరీస్‌ను మాత్రమే మొబైల్ సేవలకు ఉపయోగించినప్పటికీ.. వినియోగదారులు పెరిగేకొద్దీ 8, 7, 6 సిరీస్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

భవిష్యత్తులో నంబర్ మారుతుందా?
భారతదేశంలో మొబైల్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నంబరింగ్ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ కూడా నంబరింగ్ ప్లాన్‌లో మార్పులపై సిఫారసులు చేసింది. అయితే.. ప్రస్తుతం ఉన్న మొబైల్ నుంచి మొబైల్ కాలింగ్ విధానాన్ని కొనసాగించాలని సిఫారసు చేశారు. అంటే.. ప్రస్తుతానికి మన 10 అంకెల మొబైల్ నంబర్ విధానం మారే అవకాశం లేదు. కాగా.. మొబైల్ నంబర్ ముందు కనిపించే +91 అనేది మన దేశ కంట్రీ కోడ్. విదేశాల నుంచి భారత్‌లోని నంబర్‌కు కాల్ చేసినప్పుడు +91 తర్వాత మన 10 అంకెల మొబైల్ నంబర్‌ను డయల్ చేస్తారు.

#

Tags : 1

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)