Breaking News

లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు

Published on Thu, 09/03/2026 - 19:00

పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో.. వాహన తయారీదారులు వివిధ సెగ్మెంట్‌లు, బాడీస్టైల్స్, ధరల శ్రేణులలో కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెలలో లాంచ్ కావడానికి కొత్త కార్లు కూడా సిద్ధమయ్యాయి.

కియా సోరెంటో
భారత మార్కెట్ కోసం కియా మొదటి హైబ్రిడ్ కారు ఈ వారం చివరి నాటికి మార్కెట్లో అడుగుపెట్టనుంది. కంపెనీ దీని ధరను సెప్టెంబర్ 4న వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా ఈ మోడల్ స్థానిక డీలర్ కేంద్రాలకు కూడా రావడం ప్రారంభమైనందున, లాంచ్ అయిన వెంటనే డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కియా సోరెంటో  పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ఏడీఏఎస్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్, కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్ స్క్రీన్‌లతో కూడిన డాష్‌బోర్డ్‌పై కర్వ్డ్ డిస్‌ప్లే, పవర్డ్ టెయిల్‌గేట్, రెండవ వరుస కోసం సన్‌షేడ్‌లు, కంఫర్ట్ హెడ్‌రెస్ట్‌లు, ఇంకా వెంటిలేషన్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ ఫంక్షన్‌లతో కూడిన ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. సోరెంటోకు పోటీగా టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మజెస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టేరాన్, స్కోడా కోడియాక్ వంటి కార్లు ఉంటాయి.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి నుంచి రాబోయే తదుపరి పెద్ద మోడల్ బాలెనో ఫేస్‌లిఫ్ట్ . ఇది సెప్టెంబర్ 5న భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అప్డేటెడ్ మోడల్ కొత్త ఇంజన్ పొందనుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. 2026 బాలెనోలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఏడీఏఎస్ సూట్, కొత్త డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, సవరించిన అప్‌హోల్స్టరీ ఉంటాయి. కాస్మెటిక్ మార్పులలో కొత్త గ్రిల్, సవరించిన ముందు, వెనుక బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు అప్‌డేట్ చేయబడిన కలర్ ప్యాలెట్ ఉంటాయి.

రెనాల్ట్ ట్రైబర్ టర్బో
రెనాల్ట్ కంపెనీ చాలా రోజుల తరువాత కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ లాంచ్ చేయనున్న ట్రైబర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. ఈ నెల చివరి నాటికి దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

బీఎండబ్ల్యు ఐ5 LWB
ఎక్స్1 ఎల్డబ్ల్యుబీ లాంచ్ సందర్భంగా.. కంపెనీ ఐ5 ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ధరలు సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది 81.6kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా 669 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు వెనుక చక్రాలకు ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 268 Bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.

పోర్షే కయెన్ ఎలక్ట్రిక్
పోర్షే ఈ నెల చివర్లో భారతదేశంలో కయెన్ ఎలక్ట్రిక్‌ను అధికారికంగా పరిచయం చేయనుంది. నిజానికి ఇది గత సంవత్సరం చివర నుంచే భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.77 కోట్లు (ఎక్స్-షోరూమ్).

కయెన్ ఎలక్ట్రిక్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడిన 113kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది రెండు ట్యూనింగ్ స్టేట్స్‌లో లభిస్తుంది. కయెన్ ఎలక్ట్రిక్, కయెన్ ఎస్ ఎలక్ట్రిక్ అని పిలువబడే మొదటి రెండు వేరియంట్లు 402bhp/835Nm పవర్ విడుదల చేయగా, టాప్-స్పెక్ కయెన్ టర్బో ఎలక్ట్రిక్ 844bhp/1500Nm పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ ఒకే ఛార్జ్‌పై 643 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలని సమాచారం.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)