Breaking News

మురికిమాలిన మెగా సిటీలు

Published on Thu, 09/03/2026 - 13:09

ఆధునిక మౌలిక వసతులు, ఐటీ విప్లవం, ఆర్థిక పురోగతితో దూసుకుపోతున్న భారతీయ మహానగరాలు పారిశుధ్య నిర్వహణలో మాత్రం వెనుకబడుతున్నాయి. ఈ చేదు నిజాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మెట్రో నగరాలు సైతం చెత్త నిర్వహణలో విఫలమవుతూ అత్యంత అశుభ్రమైన నగరాల జాబితాలో నిలవడం పట్టణ పాలన లోపాలను ఎత్తిచూపుతోంది.

దేశంలోనే అత్యంత అపరిశుభ్రమైన (తక్కువ పాయింట్లు సాధించిన) టాప్-10 నగరాల జాబితాలో తమిళనాడుకు చెందిన చారిత్రక నగరం మదురై ప్రథమ స్థానంలో నిలవగా, పంజాబ్‌లోని పారిశ్రామిక కేంద్రం లుధియానా, తమిళనాడు రాజధాని చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

దేశంలో అత్యంత అపరిశుభ్రమైన టాప్‌-10 నగరాలు

1. మదురై (తమిళనాడు)

2. లుధియానా (పంజాబ్)

3. చెన్నై (తమిళనాడు)

4. రాంచీ (జార్ఖండ్)

5. బెంగళూరు (కర్ణాటక)

6. ధన్‌బాద్ (జార్ఖండ్)

7. ఫరీదాబాద్ (హర్యానా)

8. గ్రేటర్ ముంబై (మహారాష్ట్ర)

9. శ్రీనగర్ (జమ్మూ, కశ్మీర్)

10. ఢిల్లీ

ఈ జాబితాను పరిశీలిస్తే కేవలం చిన్న పట్టణాలు మాత్రమే కాకుండా బెంగళూరు, గ్రేటర్ ముంబై, ఢిల్లీ వంటి ఆర్థిక శక్తులుగా వెలుగుందుతున్న మహా నగరాలు కూడా పారిశుధ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. 'గార్డెన్ సిటీ'గా పేరుగాంచిన బెంగళూరు 5వ స్థానంలో నిలవడం, రాజధాని ఢిల్లీ టాప్-10 జాబితాలో చేరడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.

వైఫల్యానికి మూలకారణాలు

వేగవంతమైన పట్టణీకరణకు తగినట్లుగా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు లేకపోవడం, తడి-పొడి చెత్త వేరుచేయడంలో పౌరుల భాగస్వామ్యం లోపించడం, ల్యాండ్‌ఫిల్‌ సైట్లపై ఎక్కువగా ఆధారపడటం ఈ నగరాల పతనానికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఇండోర్, సూరత్ వంటి నగరాలు వినూత్న రీతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంటే ఈ 10 నగరాలు మాత్రం పారిశుధ్య మౌలిక వసతుల లేమితో సతమతమవుతున్నాయి. కేవలం నిధుల కేటాయింపుతోనే స్వచ్ఛత సాధ్యం కాదని, ప్రజా ప్రతినిధుల జవాబుదారీతనం, స్థానిక సంస్థల సమర్థత, పౌరుల్లో మార్పు వచ్చినప్పుడే స్వచ్ఛ భారత్ కల సాకారమవుతుందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌!

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)