Breaking News

CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం!

Published on Tue, 09/01/2026 - 07:04

టెక్ దిగ్గజం యాపిల్‌కు సుమారు 15 సంవత్సరాలు సీఈఓగా నాయకత్వం వహించిన టిమ్ కుక్ (Tim Cook) ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తన చివరి రోజు సందర్భంగా.. ఉద్యోగులకు ఆయన ఒక భావోద్వేగమైన సందేశం పంపారు.

ఇంతకాలం తనకు ఇచ్చిన సహకారం, ప్రేమ, మద్దతుకు ఉద్యోగులందరికీ టిమ్ కుక్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఒక అద్భుతమైన టీమ్‌గా ఆయన ప్రశంసించారు. సీఈఓగా తన విజయానికి తాను మాత్రమే కారణం కాదని, తనతో కలిసి పనిచేసిన ఉద్యోగుల వల్లే అది సాధ్యమైందని చెప్పారు. యాపిల్ సంస్కృతిని గురించి కూడా ప్రస్తావిస్తూ.. స్టీవ్ జాబ్స్‌కు నివాళులర్పించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఈఓ జాన్ టెర్నస్‌కు స్వాగతం పలికారు.

2011లో సీఈఓగా బాధ్యతలు
కుక్ 2011 నుంచి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. యాపిల్ సహ వ్యవస్థాపకుడు జాబ్స్ మరణించడానికి కేవలం కొన్ని వారాల ముందు ఆయన సంస్థ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అనేక విజయాలు సాధిస్తూ.. సంస్థను అభివృద్ధి చేశారు. ఈయన సారథ్యంలో అనేక కొత్త ఉత్పత్తులు లాంచ్ అయ్యాయి.

అయితే.. టిమ్ కుక్ యాపిల్ కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగడం లేదు. ఆయన సీఈఓ పదవి నుంచి మాత్రమే తప్పుకుంటున్నారు. కానీ కంపెనీలో మరో కొత్త బాధ్యతలో కొనసాగనున్నారు. సీఈఓగా జాన్ టెర్నస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తులను తయారు చేయడంలో జాన్ టెర్నస్‌కు మంచి అనుభవం, సామర్థ్యం ఉందని కుక్ ప్రశంసించారు. తన తర్వాత సంస్థను చాలా బాగా నడిపిస్తారని ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

టిమ్ కుక్ సందేశం
యాపిల్ కంపెనీ నేడు ఈ స్థాయికి చేరుకుందంటే.. అది కేవలం ఒక వ్యక్తి వల్ల రాలేదని, మొత్తం టీమ్ కలిసి పనిచేయడం వల్లే వచ్చిందని కుక్ చెప్పారు. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం, కష్టాల్లో సహాయం చేసుకోవడం, చేసే పనిపై బాధ్యతతో ఉండటం యాపిల్ సంస్కృతిలో ముఖ్యమైన భాగాలని వివరించారు. యాపిల్ ద్వారా ప్రపంచంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రతి ఉద్యోగికి అవకాశం ఉందని, ఆ అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దని ఆయన సూచించారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)