మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ
Breaking News
నైటింగేల్ ఫేషియల్! చర్మానికి నిగారింపు, మెరిసేలా..
Published on Sun, 08/30/2026 - 11:10
పూర్వం జపాన్‌లోని కళాకారులు తమ అందం కోసం ఉపయోగించే సాధనాల్లో ‘ఉగుయిసు నో ఫున్’ ఒకటి. అంటే జపనీస్ నైటింగేల్‌గా పిలిచే ‘బుష్ వార్బర్’ అనే ఒక పక్షి విసర్జన. దీనిని ఎండబెట్టి, శుద్ధిచేసి, మెత్తని పొడిలా చేసి నీటితో కలిపి ఉపయోగించేవారు. ఉగుయిసు నో ఫుడ్‌లో యూరియా, గ్వానిన్, ఇతర నైట్రోజన్ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ నుంచి ఉత్పన్నమయ్యే గ్వానిన్ అనే పదార్థం దీనిలో ఉంటుంది. ఇది చర్మానికి నిగారింపునిస్తుందని వారు నమ్మేవారు. కొన్ని బ్యూటీ ఉత్పత్తుల్లో ఇప్పటికీ దీనిని ఉపయోగిస్తున్నారు.
చర్మసంరక్షణ కోసం ‘ల్యాంకోమ్ రెనర్జీ నానో రీసర్ఫేసర్’ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇందులో నాలుగువందల అతిసూక్ష్మమైన నానో–టిప్స్‌తో కూడిన నానోచిప్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది చర్మంపై కంటికి కనిపించని సూక్ష్మ మార్గాలను ఏర్పాటు చేయడం ద్వారా, మనం వాడే స్కిన్ కేర్ సీరమ్‌లు చర్మంలోకి వేగంగా, లోతుగా ఇంకేలా చేస్తుంది. సాధారణంగా క్లినిక్‌లలో సూదులతో చేసే చికిత్సలో నొప్పి ఉండటంతో పాటు చర్మం కోలుకోవడానికి సమయం పడుతుంది.
కానీ ఈ పరికరం ఎలాంటి నొప్పి లేకుండా సున్నితంగా పనిచేస్తుంది. ల్యాంకోమ్ ట్రిపుల్ సీరమ్‌తో కలిసి పనిచేసే ఈ డివైజ్.. ముడతలు తగ్గించడం, సన్నని గీతలు పోగొట్టడం, చర్మం బిగుతుగా మారడం, చర్మ ఛాయను మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. అత్యంత సున్నితమైన చర్మతత్వం ఉన్నవారితో సహా ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించవచ్చు.
సిల్కీగా.. జాలువారేలా!
జుట్టు పట్టులా మృదువుగా ఉంచుకోవడానికి ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తలకు గోరువెచ్చని కొబ్బరినూనె రాసి, సుతారంగా మర్దన చేసి, అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. తల పొడిబారిపోకుండా ఉండటానికి గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది.
షాంపూ చేసిన ప్రతిసారీ జుట్టు మధ్య భాగం నుంచి చివర్ల వరకు కండిషనర్ రాసి.. కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. తడిగా ఉన్నప్పుడు జుట్టు సులభంగా తెగిపోవచ్చు. అందుకని వెంటనే గట్టిగా దువ్వకుండా, కొద్దిగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో మెల్లగా చిక్కులు తీయాలి.
Tags : 1