Breaking News

సంకేతం అందిందా?

Published on Sun, 08/30/2026 - 04:51

మెదడులోని ‘సప్లిమెంటరీ మోటార్‌ ఏరియా’ అనే భాగం ఉంటుంది. ఇది మెదడులోని ఫ్రంటల్‌ లోబ్‌ లోపలి ఉపరితలంలో ఉండే చిన్న  ప్రాంతం. దీని గురించి చాలామందికి పెద్దగా తెలియదుగానీ... మానవ దేహంలో మాత్రం ఓ అద్భుతమైన పని చేస్తుంది. అదేమిటంటే... ‘‘ఏదైనా పని చేయాలన్న ఆ ఉద్దేశాన్ని... చేతల్లోకి తీసుకురావడంలో ఈ సప్లిమెంటరీ మోటార్‌ ఏరియా (ఎస్‌ఎమ్‌ఏ)ది కీలక భూమిక పోషిస్తుంది. అంటే... మెదడు విషయానికి వస్తే... ‘చేయాలనుకోవడాన్ని’ ‘చేయడంగా’ మార్చే  ప్రాంతాల్లో ఎస్‌ఎమ్‌ఏ ఒకటి.

ఎస్‌ఎమ్‌ఏ ఏం చేస్తుందంటే...
కదలికలు జరగాల్సిన తీరుతెన్నుల్ని ముందుగానే సిద్ధం చేస్తుంది. కదలాలనుకున్న ఆ సంకల్పం మెదడులోకి రాగానే... ‘ఎస్‌ఎమ్‌ఏ’ ఆ పనిని మొదలుపెట్టేస్తుంది. దీనికి ఓ తార్కాణమే కీబోర్డు వైపు చూడకుండానే మనం టైప్‌ చేయగలగడం. మన వేళ్లు కదిలేలోపే అవి కదలాల్సిన క్రమాన్ని ‘ఎస్‌ఎమ్‌ఏ’ సిద్ధం చేసేస్తుంది. అందుకే మనం టకటకా టైప్‌ చేసేయగలుగుతాం. 

రెండు చేతుల కదలికల సమన్వయానికీ...
చప్పట్లు కొట్టేటప్పుడూ, షూలేసులు కట్టుకునేటప్పుడూ మన చెతులు రెండూ ఒక సమన్వయంతో, ఒకే లయలో పనిచేయాలి. ఆ సమన్వయానికి ‘ఎస్‌ఎమ్‌ఏ’ది కీలక భూమిక.  

మధ్యలోనే పని ఆపేయడానికి కూడా... 
అంతేకాదు... ఒక క్రమబద్ధమైన కదలికను మధ్యలో ఆపేయడమూ ‘ఎస్‌ఎమ్‌ఏ’ పనే. రోడ్డు దాటుతూ ఉంటాం. అకస్మాత్తుగా ఓ కారు వేగంగా వస్తూ కనిపించగానే... అప్పటివరకూ కొనసాగుతున్న నడక అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇందుకు దోహదపడేదీ ‘ఎస్‌ఎమ్‌ఏ’నే. 

అలవాటైన కదలికల్లో ఆటోపైలట్‌లాగా... 
రోజూ వెళ్లే దారిలో కారు నడుపుతున్నప్పుడు... ఎక్కడ ఎప్పుడు ఎలా మలుపులు తి΄్పాలో మనకు పెద్దగా గుర్తుండకపోయినప్పటికీ... ఆ కదలికలను గుర్తుంచుకొని స్వతహాగా అవి జరిగిలే ఎస్‌ఎమ్‌ఏ చూస్తుంది. ఎస్‌ఎమ్‌ఏ కండరాలకు బలం ఇవ్వదు. ఆ పని ప్రధాన మోటార్‌ కార్టెక్స్‌ది. ఎస్‌ఎమ్‌ఏ  మనకు కావాలనుకున్న కదలికను ప్లాన్  చేయడం. దాని వరసను సిద్ధం చేయడం, దాన్ని మొదలుపెట్టడం. 

శస్త్రచికిత్స తర్వాత కొంతకాలం ఎస్‌ఎమ్‌ఏ తాత్కాలికంగా స్తబ్ధంగా మారితే ఆ కండిషన్‌ను ఎస్‌ఎమ్‌ఏ సిండ్రోమ్‌ అంటారు. దీని బాధితులు పూర్తిగా స్పృహలోనే  ఉంటారు. అన్నీ అర్థం చేసుకుంటారు. కదలాలనే బలమైన కోరికా ఉంటుంది. అయినా... కదలిక ప్రక్రియను తాము మొదలుపెట్టలేరు. ఎందుకంటే... మెదడు ‘సరే... మొదలుపెట్టు’ అనే ఆదేశాన్ని ఎక్కడో పోగొట్టుకున్నట్టుంటుంది.

వైద్య శిక్షణలో ఉన్న డాక్టర్లు తొలిసారి ఎస్‌ఎమ్‌ఏ సిండ్రోమ్‌ను చూసినప్పుడు వారికి అదో మాయలా అనిపించవచ్చు. బాధితులు తమ ఆలోచనకూ, చేతలకూ మధ్యన ఎక్కడో చిక్కుకుపోయినట్టు ఉంటారు. నిన్న చేయలేని పనిని ఈ రోజు మెదడు మళ్లీ ప్రయత్నిస్తుంది.

ప్రతిరోజూ... మెదడులో కనిపించని నాడీ మార్గాలు కాస్త మరింత సమర్థంగా పనిచేయడం నేర్చుకుంటాయి. దాంతో సప్లిమెంటరీ మోటార్‌ ఏరియా మళ్లీ క్రియాశీలమవుతుంది.

ఓ పనిలో ఉండగానే మరో పనిలోనూ... 
ఫ్రెండ్స్‌తో మాటల్లో ఉంటూనే టేబుల్‌పై ఉన్న నీళ్ల గ్లాసు అందుకోవడం; కారు హారన్‌ వినగానే ఉలిక్కిపడి వెనక్కి జరగడం, చాలాసేపు కూర్చున్న తర్వాత కొంత సంభాషణ చివరి దశలో ఉండగానే కూర్చీ చేతులు పట్టుకుని పాక్షికంగా లేవడానికి సిద్ధం కావడం... ఇలాంటి పనులన్నీ ‘ఎస్‌ఎమ్‌ఏ’ వల్లనే.

#

Tags : 1

Videos

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు

అంబటి రాంబాబుకి జగన్ పరామర్శ

పాలు పారబోసిన రైతులు.. ధర పెంచాలంటూ తమిళనాడులో నిరసన

షాక్ లో యాంకర్ ఈశ్వర్.. తమాషా కాదు అడిగితే కాల్చి పడేస్తారు.. కారుమూరి సంచలన నిజాలు

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)