Breaking News

లేటెస్ట్‌ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ డీల్‌..

Published on Sat, 08/29/2026 - 20:40

ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాలామందికి ఈ ప్రీమియం ఫోన్‌లు వాడాలని ఉన్నా వాటి అధిక ధరల కారణంగా కొనలేరు. అయితే యాపిల్‌ ఐఫోన్‌ కొత్త సిరీస్‌ విడులకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రస్తుత ఐఫోన్‌ 17 ప్రో (iPhone 17 Pro)పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 256GB వేరియంట్‌ను రూ.90 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 17 ప్రో 256GB వేరియంట్‌ ప్రస్తుతం రూ.1,29,900కు లిస్టయింది. దీని అసలు ధర రూ.1,34,900 కాగా, నేరుగా రూ.5,000 తగ్గింపు లభిస్తోంది. అదనంగా అర్హత కలిగిన ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.9,000 వరకు బ్యాంక్‌ డిస్కౌంట్‌ లభిస్తున్నట్లు ఉత్పత్తి పేజీలో చూపిస్తోంది.

ఈ డీల్‌లో అసలు ఆకర్షణ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌. ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం ఎంపిక చేసిన పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్‌ విలువను అందిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్‌ 15కి రూ.30,000 వరకు విలువ లభించవచ్చని తాజా డీల్‌ వివరాలు సూచిస్తున్నాయి. రూ.30,000 ఎక్స్ఛేంజ్‌ ప్రయోజనం, రూ.9,000 బ్యాంక్‌ డిస్కౌంట్‌ రెండూ పూర్తిగా లభిస్తే ఐఫోన్‌ 17 ప్రో రూ.90,900 లకే వస్తుంది.

ఐఫోన్‌ 17 ప్రో మోడల్‌లో A19 ప్రో చిప్‌, 6.3 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, 48MP కెమెరా సిస్టమ్‌, 18MP సెంటర్‌ స్టేజ్‌ ఫ్రంట్‌ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Videos

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు

అంబటి రాంబాబుకి జగన్ పరామర్శ

పాలు పారబోసిన రైతులు.. ధర పెంచాలంటూ తమిళనాడులో నిరసన

షాక్ లో యాంకర్ ఈశ్వర్.. తమాషా కాదు అడిగితే కాల్చి పడేస్తారు.. కారుమూరి సంచలన నిజాలు

సిగ్గు తెచ్చుకోండి... నిర్మలా సీతారామన్ అప్పుడే చెప్పారు.. నాగ మల్లీశ్వరి షాకింగ్ నిజాలు

ఇది సార్ మీ అసలు రూపం.. చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వరుదు కళ్యాణి

పెళ్లికూతురిపై అక్షింతలు వెయ్యమంటే పెళ్లికూతురి తల్లిపై వేసాడు..

Photos

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు)