ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్
Breaking News
పసిడి రుణాలు @ రూ. 1.5 లక్షల కోట్లు
Published on Mon, 08/24/2026 - 08:03
చెన్నై: గోల్డ్ లోన్స్‌కి డిమాండ్ గణనీయంగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి తమ పసిడి రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1.25 లక్షల కోట్లుగా ఉన్నట్లు వివరించారు.
పసిడి రుణాల సెగ్మెంట్ 20 శాతం మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మొత్తం రుణాల్లో ఆర్ఏఎం (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ) వాటా 65 శాతంగా ఉండగా, మిగతా 35 శాతం వాటా కార్పొరేట్ రంగానిది ఉంటోందని వివరించారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈల దన్నుతో ఆర్ఏఎం విభాగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్) 15.30 శాతం వృద్ధి చెందినట్లు చెప్పారు. సేవింగ్స్ డిపాజిట్లు 13.54 శాతం, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 26.33 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు.
Tags : 1