అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
Breaking News
పాండవుల ధనుస్సులు, శంఖాల పేర్లు
Published on Mon, 08/24/2026 - 06:36
మహా భారత యుద్ధంలో పాండవులు, ముఖ్యంగా యుద్ధానికి దిశ, దశ చూపిన శ్రీ కృష్ణ పరమాత్మ తదితరులు ఉపయోగించిన ధనుస్సులు, శంఖాల పేర్లు మీకు తెలుసా...?
శ్రీ కృష్ణుని ధనుస్సు పేరు శారంగం...శంఖం పేరు పాంచజన్యం
ధర్మరాజు ధనుస్సు పేరు మహేంద్ర... శంఖం పేరు అనంత విజయం, భీముని ధనుస్సు పేరు వాయువ్య. అయితే చాలా మంది భీముడు గదతోనే యుద్ధం చేసాడని అనుకుంటారు. ఆ గద పేరు వృకోదర. అంతేకాకుండా భీముడు గొప్ప మల్ల యోధుడు కూడా. కాగా భీముని శంఖం పేరు పౌండ్రం.
అర్జునిని ధనుస్సు పేరు గాండీవం. శంఖం పేరు దేవదత్తం. నకులుడి ధనుస్సు పేరు వైష్ణవ శంఖం పేరు సుఘోషం. సహదేవుని ధనుస్సు పేరు అశ్వివ. శంఖం పేరు మణి పుష్పకం. అభిమన్యుని ధనుస్సు పేరు రౌద్ర.
ఘటోత్కచుని ధనస్సు పేరు పౌలస్త్రయ.కాగా కురుపితామహుడైన భీష్ముని శంఖం పేరు శైశాంక. ధుర్యోధనుని గద పేరు కౌముది. కర్ణుని ధనుస్సు పేరు విజయ. శంఖం పేరు హిరణ్యగర్భ.
– సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు
Tags : 1