Breaking News

నదిలో నాణేలు

Published on Mon, 08/24/2026 - 04:51

ఒక ఆధ్యాత్మిక గురువు తన శిష్యులతో కలిసి బోధనలు చేయడానికి పల్లెకు బయలుదేరాడు. వారి దారిలో ఒక నది ఉంది. కొందరు పిల్లలు ఆ నదిలోకి దుముకుతూ కనిపించారు. నీళ్లలో కొద్దిసేపు మునిగి లేచాక కొందరి ముఖాల్లో మెరుపు ఉంది. మరికొందరి ముఖాల్లో విచారం ఉంది. కానీ వాళ్లందరూ ఉత్సాహంగా ఉన్నారు.

ఆ పిల్లలను చూసిన శిష్య బృందం ‘వీరిది కదా అదృష్టం’ అన్నారు. ‘నిజంగా వారిది అదృష్టమా?’ అని అడిగాడు గురువు. ‘అదృష్టం కాక ఇంకేమిటి గురూజీ! ఇలాంటి తియ్యటి బాల్యం ఎంతమందికి దొరుకుతుంది?’ అని బదులిచ్చారు.

గురువు పక్కనే ఉన్న రావిచెట్టు కింద కూర్చుంటూ ‘మీరు కొద్దిసేపు ఆ పిల్లలతో గడిపి రండి, అంతసేపు నేను నది ప్రవాహాన్ని గమనిస్తూ ఉంటాను’ అన్నాడు. శిష్యులు ఆనందంగా పిల్లల దగ్గరకు వెళ్లారు.

అర్ధగంట గడిచాక శిష్యులు వెనక్కి వచ్చారు. వెళ్లేటప్పుడు విరిసిన మల్లె మొగ్గల్లా ఉన్న వారి ముఖాలు తిరిగి వస్తున్నప్పుడు వాడిన మల్లెల్లా ఉన్నాయి. ఎందుకలా ఉన్నారని ప్రశ్నించాడు గురువు. ‘ఏమి చెప్పమంటారు గురూజీ... ఆ పిల్లలు కడు పేదవారు. సరైన కుటుంబ రక్షణ, పోషణ లేనివారు. ఆనందంగా నీళ్లలో ఆడుకుంటున్నారని భావించాము. కానీ వారు నదిలోకి దూకుతున్నది చిల్లర నాణేల కోసం’ అని చెప్పారు. ఆశ్చర్యంగా వారి ముఖాలకేసి చూశాడు గురువు.

‘ఈ నదికి దగ్గరలో అమ్మవారి గుడి ఉంది. అక్కడికి వచ్చే భక్తులు తమ మొక్కుబడిలో భాగంగా ఈ నదిలో నాణేలు విసురుతారు. వాటికోసం వీరు గాలిస్తూ ఉంటారు.ఆకలి తట్టుకోలేని వీరు ఆ దొరికిన పైసలతో కడుపు నింపుకుంటారు. నాణేలు దొరికిన రోజు పండుగ, లేని రోజు పస్తులే’ అని చెప్పారు. వెంటనే గురువు ‘‘దూరం నుంచి చూస్తే కొండలు చాలా నునుపు గా ఉంటాయి. దగ్గరకు వెళ్లి చూస్తే రాళ్లు, రప్పలు, చెట్లుచేమలు కనిపిస్తాయి. చాలామంది జీవితాలు కూడా అంతే. చూడటానికి చాలా గొప్పగా అనిపిస్తాయి. దగ్గరకు వెళ్లి చూస్తే కానీ వాస్తవ పరిస్థితి అర్థం కాదు’’ అని వివరించాడు.

చూడటానికి, వాస్తవానికి తేడా ఉంటుందని గ్రహించారు శిష్యులు. తమవంతు సాయం చేద్దామని అందరూ కలిసి పిల్లల దగ్గరకు వెళ్లారు. ‘ఆకలిగా ఉన్నప్పుడు మా ఆశ్రమానికి రండి. రోజూ సత్సంగం జరుగుతుంది. సత్సంగం తర్వాత అందరూ కలిసి భోజనం చేద్దాం’ అని చెప్పారు. ఆ పిల్లల ముఖాలు వెండినాణేల్లా మెరిసాయి.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

#

Tags : 1

Videos

ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)